Diesel బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్ Full Guard 2.5

Full Guard 2.5
డీజిల్ బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్ Full Guard 2.5

ప్రముఖ బ్రాండ్ డీజిల్ (Diesel) సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ‘ఫుల్ గార్డ్ 2.5’ (Full Guard 2.5) పేరుతో ఈ వాచ్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.24,495. కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌తో పాటు సెలక్టెడ్ స్టోర్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. నవంబర్ నుంచి సేల్ ప్రారంభమవుతుంది.

ఈ లేటెస్ట్ వేరబుల్ డివైస్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 2100 ప్రాసెసర్ పై స్పందిస్తుంది. ఓఎస్ విషయానికి వచ్చేసరికి గూగుల్ అభివృద్ధి చేసిన WearOS ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 4.4 ఆపై వెర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను వాచ్ సపోర్ట్ చేస్తుంది. ఇక యాపిల్ ఐఫోన్స్ విషయానికి వచ్చేసరికి iOS 9.3 ఆపై వెర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఐఫోన్‌లను ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.

Also Read : మార్కెట్లోకి మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌లు Motorola One, Motorola One Power

రాపిడ్ ఛార్జింగ్, మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్స్, కస్టమైజబుల్ వాచ్ ఫేసెస్ వంటి ఆసక్తికర ఫీచర్లు ఈ స్మార్ట్ వాచ్ లో ఉన్నాయని కంపెనీ తెలిపింది. 3 ATM వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో వస్తోన్న ఈ వాచ్ 30 మీటర్ల లోతులో మునిగినప్పటికి చెక్కు చెదరకుండా పనిచేస్తుందట.

ఈ వాచ్‌ను హార్ట్‌రేట్ మానిటర్‌లా కూడా ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. బిల్ట్ ఇన్ జీపీఎస్ సపోర్ట్ ద్వారా డిస్టెన్స్‌ను ట్రాక్ చేసుకునే వీలుంటుందట. వివిధ రకాల డయల్ ఎఫెక్ట్స్‌ను కలిగి ఉండే ఈ వాచ్ డిస్‌ప్లే స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రకరకాల యానిమేషన్స్‌లోకి మారిపోతుందని కంపెనీ తెలిపింది.

Also Read : షియోమీ Poco F1 రికార్డుల మోత, 5 నిమిషాల్లో రూ.200 కోట్ల అమ్మకాలు

మాటీ స్టీల్ కేస్ విత్ బ్లాక్ లెదర్ స్ట్రాప్, గన్ మెటల్ స్టీల్ కేస్ విత్ బ్రౌన్ లెదర్ స్ట్రాప్, మాటీ స్టీల్ కేస్ విత్ బ్లాక్ సిలికాన్ స్ట్రాప్, గన్ మెటల్ స్టెయిన్ లెస్ స్టీల్ కేస్ ఆన్ ఏ త్రీ-లింక్ బ్రాస్లెట్ ఇలా రకరకాల కాంభినేషన్స్‌లో ఈ వాచ్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.