Apple నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్, ఈసీీజీ స్కానర్ సపోర్టుతో లభ్యం..

apple watch series 4
Apple నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్, ఈసీీజీ స్కానర్ సపోర్టుతో లభ్యం..

బుధవారం శాన్ జోస్‌లో నిర్వహించిన ఓ స్పెషల్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా యాపిల్ తన కొత్త ఐఫోన్‌ల(iPhones)తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 4 (Apple Watch Series 4) స్మార్ట్‌వాచ్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. కొత్త ఐఫోన్‌లకు సంబంధించిన వివరాలను కొద్ది గంటల క్రితం పోస్ట్ చేసిన కథనంలో వివరించటం జరిగింది. ఇప్పుడు యాపిల్ వాచ్ సిరీస్ 4 స్మార్ట్‌వాచ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

Also Read : కొత్త iPhone మోడల్స్‌ను అనౌన్స్ చేసిన Apple, సెప్టంబర్ 28 నుంచి భారత్‌లో లభ్యం

గాడ్జెట్స్360 రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం యాపిల్ వాచ్ సిరీస్ 4 స్మార్ట్‌వాచ్‌కు సంబంధించి ప్రారంభ వేరియంట్ ధర రూ.40,990గా ఉండబోతోంది. జీపీఎస్ (GPS) ఇంకా సెల్యులార్ (Cellular) ఎడిషన్స్‌లో ఈ వాచీలు అందుబాటులో ఉంటాయి. జీపీఎస్ ఎడిషన్‌కు సంబంధించిన 40ఎమ్ఎమ్ మోడల్ ధర రూ.40,900గా ఉంటుంది.

Also Read : Vivo V11 Pro @ లక్ష ప్రీ-బుకింగ్స్

జీపీఎస్ ఎడిషన్‌ 44ఎమ్ఎమ్ మోడల్ ధర రూ. 43,900గా ఉంటుంది. సెల్యులార్ ఎడిషన్‌కు సంబంధించి 40ఎమ్ఎమ్ మోడల్ (అల్యూమినియమ్ కేస్) ధర రూ.49,900గా ఉంటుంది. 44ఎమ్ఎమ్ మోడల్ ధర రూ.52,900గా ఉంటుంది. ఈ రెండు ఎడిషన్స్ సిల్వర్, స్పేస్ గ్రే, గోల్డ్ అల్యుమినియమ్ కేస్‌లలో అందుబాటులో ఉంటాయి.

Also Read : Reliance Jio కొత్త క్యాష్‌బ్యాక్ ఆఫర్ గురించి తెలుసుకున్నారా..?

ఇదే సమయంలో యాపిల్ వాచ్ సిరీస్ 4కు సంబంధించి సెల్యులార్ స్టెయిన్‌లెస్ స్టీల్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ వేరియంట్ ప్రత్యేకమైన స్పోర్ట్స్ బ్యాండ్‌తో లబ్యమవుతుంది. 40ఎమ్ఎమ్ మోడల్ ధర రూ.67,900. 44 ఎమ్ఎమ్ మోడల్ ధర రూ.71,900. ఇదే మోడల్‌కు సంబంధించి మిలానీస్ రిస్ట్‌బ్యాండ్‌తో వస్తోన్న ఎమ్ఎమ్ మోడల్ ధర రూ.76,900. 44 ఎమ్ఎమ్ మోడల్ ధర రూ.80,900. స్టెయిన్‌లెస్ స్టీల్ మోడల్స్ బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ వాచ్‌కు బిల్ట్-ఇన్ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ (ఈసీీజీ) స్కానర్ ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.