ఆన్‌లైన్ షాపింగ్‌ చేస్తున్పప్పుడు ఈ విషయాలు మరవకండి

ఆన్‌లైన్ షాపింగ్‌ చేస్తున్పప్పుడు ఈ విషయాలు మరవకండి

దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ మరింతగా ఊపందుకుంది. ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా మనకు కావాల్సిన వస్తువులను ఇంట్లోనే కూర్చుని ఆర్డర్ చేసుకునే వీలు ఉంటుంది. సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం బెస్ట్ సెక్యూరిటీ టిప్స్..

నకిలీ ఈకామర్స్ సైట్‌లలో షాపింగ్ చేయటం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉంచి కాబట్టి, షాపింగ్ నిమిత్తం ఈ-కామర్స్ సైట్‌ను ఎంపిక చేసుకునేముందు ఆ వెబ్‌సైట్‌కు సంబంధించిన రివ్యూ రేటింగ్‌లను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నట్లయితేనే షాపింగ్‌కు ఉపక్రమించండి. SSL (Secure Sockets Layer) సెక్యూరిటీ ఉన్న ఈ-కామర్స్  సైట్‌లలో మాత్రమే ఆన్‌లైన్ షాపింగ్ సురక్షితం. SSL సెక్యూరీటీ వ్యవస్థను కలిగి ఉన్న వెబ్‌సైట్ యూఆర్ఎల్ HTTPS://తో మొదలవుతుంది.

మీ ఆన్‌లైన్ కొనుగోళ్లకు సంబంధించిన  బిల్లును ప్రింట్ రూపంలో  భద్రంగా ఉంచుకోండి. ఆర్డర్ చేసిన ఉత్పత్తులకు సంబంధించి భవిష్యత్‌లో ఏదైనా సమస్య ఎదురైతే వారంటీ పరంగా ఈ బిల్స్ ఉపయోగపడతాయి. ఆన్‌లైన్ షాపింగ్‌కు క్రెడిట్ కార్డులను ఉపయోగించటం చాలా సురక్షితమైన పద్ధతి. ఆన్‌లైన్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ఫీచర్ సహాయంతో క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించటం ద్వారా మీ షాపింగ్ మరింత సురక్షితంగా ఉంటుంది.

మీరు కొనుగోలు చేసే వస్తువుకు సంబంధించి బిల్లింగ్, గ్యారంటీ, డెలివరీ వంటి అంశాలకు సంబంధించి నిబంధనలు ఇంకా షరతులను చదవండి. ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లలో అనవసరంగా మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయవద్దు. క్రెడిట్ ఇంకా డెబిట్ కార్డుల ద్వారా చెల్లించిన మొత్తానికి సంబంధించిన లావాదేవీలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.