whatsApp కొత్త ఫీచర్ Picture-in-Picture, ఇక వీడియోలు చూస్తూనే చాటింగ్ చేసుకోవచ్చు..

whatsApp Picture-in-Picture
whatsApp కొత్త ఫీచర్ Picture-in-Picture, ఇక వీడియోలు చూస్తూనే చాటింగ్ చేసుకోవచ్చు..

ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న పిక్షర్ ఇన్ పిక్షర్ (Picture-in-Picture) ఫీచర్‌ను వాట్సాప్ అఫీషియల్‌గా అందుబాటులోకి తీుసుకువచ్చింది. అక్టోబర్ 2018లో వెలుగులోకి వచ్చిన ఈ ఫీచర్ అప్పటి నుంచి బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

తాజాగా ఈ ఫీచర్‌ను వాట్సాప్ స్టేబుల్ వెర్షన్ 2.18.380 ద్వారా సంస్థ అఫీషియల్‌గా రోల్ అవుట్ చేసింది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇంకా యూట్యూబ్‌లకు సంబంధించిన వీడియోలను స్ర్కీన్ పై ఓ చిన్న విండోలో చూస్తూనే వాట్సాప్ చాట్‌లను స్ర్కోల్ చేసుకునే వీలుంటుంది. ఈ ఫీచర్ గ్రూప్ చాట్‌లతో పాటు వ్యక్తిగత చాట్స్‌లోనూ వర్క్ అవుతుంది. 

whatsApp కొత్త ఫీచర్ Picture-in-Picture, ఇక వీడియోలు చూస్తూనే చాటింగ్ చేసుకోవచ్చు..

ఇదే తరహా ఎక్స్‌పీరియన్స్‌ను వాట్సాప్ ఐఓఎస్ యూజర్లకు ఈ ఏడాది జనవరి నుంచే వాట్సాప్ అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ పిక్షర్ ఇన్ పిక్షర్ (పిఐపి) ఫీచర్‌ను ఉపయోగించుకునేందుకు ఎటువంటి ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవల్సిన అవసరం ఉండదు. 

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇంకా యూట్యూబ్‌లకు సంబంధించి ఏదైనా లింక్ పై క్లిక్ చేసిన వెంటనే సంబంధిత వీడియో ఓ చిన్నదైన డెడికేటెడ్ విండలో ఓపెన్ అయి వాట్సాప్ చాట్స్ పైన కూర్చుంటుంది. తద్వారా ఆ వీడియోను చూస్తూనే వాట్సాప్ చాటింగ్ ను కంటిన్యూ చేసుకునే వీలుంటుంది. 

వాట్సాప్ పిక్షర్ ఇన్ పిక్షర్ (పిఐపి) ఫీచర్‌ను ఆస్వాదించాలనుకునే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు వెంటనే ప్లేస్టోర్‌లోకి వెళ్లి లేటెస్ట్ వెర్షన్ వాట్సాప్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.