హైదరాబాద్‌లో OPPO రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్

Oppo Research and Develop Center Hyderabad
హైదరాబాద్‌లో OPPO రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో (OPPO), భారత్‌లో తన మొట్టమొదటి రిసెర్చ్ అండ్  డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటు చేసింది. ఒప్పో సంస్థకు చైనాకు వెలుపల ఉన్న మూడు రిసెర్చ్ అండ్  డెవలప్‌మెంట్ సెంటర్‌‌లలో ఇదే పెద్దది కావటం విశేషం.

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఒప్పో బ్రాండ్ ఫోన్‌లకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. అయితే, పోటీ మార్కెట్ కారణంగా షావోమి, సామ్‌సంగ్, వివో, హానర్ వంటి బ్రాండ్‌ల నుంచి ఒప్పో తీవ్రమైన కాంపిటీషన్‌ను ఫేస్ చేయవల్సి వస్తుంది. 

హైదరాబాద్‌లో OPPO రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్

హైదరాబాద్‌‌లో  ఏర్పాటు చేసిన రిసెర్చ్ అండ్  డెవలప్‌మెంట్ సెంటర్‌ ప్రధానంగా కట్టింగ్-ఎడ్జ్‌తో పాటు ఇన్నోవేటివ్ ఇంకా అడ్వాన్సుడ్ టెక్నాలజీస్ రూపకల్పన పై  దృష్టి సారిస్తుందని ఒప్పో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సెంటర్‌ను ముందుకు నడిపించేందుకు అవసరమైన టాలెంట్ ను ప్రముఖ ఐఐటి ఇన్ స్టిట్యూట్స్ అలానే ఇండియన్ ఆపరేటర్స్ సహకారంతో హైర్ చేసుకుంటామని ఒప్పో తెలిపింది.

2019లో చేపట్టి రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ నిమిత్తం 1.5 బిలియన్ డాలర్లను ప్రపంచ పెట్టబుడల క్రింద పెడుతున్నట్లు ఒప్పో ఇటీవల వెల్లడించింది. భవిష్యత్ లో స్మార్ట్ ఫోన్ లతో పాటు స్మార్ట్ డివైసెస్ ను కూడా మార్కెట్లో తీసుకువచ్చే యోచనలో ఒప్పో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఒప్పో సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 7 రిసెర్చ్ అండ్  డెవలప్‌మెంట్ సెంటర్స్ ఉన్నాయి. వాటిలో నాలుగు చైనాలోని బీజింగ్, షాంఘై, షెన్జెన్, డోంగ్గున్ ప్రాంతాల్లో నెలకొల్పబడి ఉన్నాయి. మిగిలిన మూడు యూఎస్, జపాన్ ఇంకా ఇండియాలలో ఉన్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.