హైదరాబాద్‌లో OnePlus రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌

OnePlus Logo
హైదరాబాద్‌లో OnePlus రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌

చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus), భారత్‌లో తన మొట్టమొదటి రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదారాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ సెంటర్‌, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్  టెక్నాలజీతో పాటు మెచీన్ లెర్నింగ్ టెక్నాలజీల అభివృద్థిలో కీలక పాత్ర పోషించనుందని కంపెనీ తెలిపింది. ఇదే సమయంలో వన్‌ప్లస్ ఇండియన్ కమ్యూనిటీకి  అవసరమైన ఇన్నోవేషన్స్ కూడా ఇక్కడి నుంచే డ్రైవ్ చేయటం జరుగుతుందని కంపెనీ వెల్లడించింది.

Oneplus Research and Development center Hyederabad
Oneplus to open its first research and development center in hyderabad

భారత్‌లో తమ మొట్టమొదటి రిసెర్చ్ అండ్  డెవలెప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎందుకు ఎంపిక చేసుకోవల్సి వచ్చింది అనే దాని పై కంపెనీ స్పందిస్తూ,  హైదరాబాద్ నగరం యాక్టివ్ స్టార్ట్-అప్ జోన్‌లకు మరింత అనువుగా ఉందని, ఇక్కడ నుంచే అనేక ఎమర్జింగ్ టెక్నాలజీస్ పురుడుపోసుకుంటున్నాయని, ఈ కారణంగానే హైదరాబాద్‌ను సెలక్ట్ చేసుకున్నట్లు కంపెనీ వివరించింది.

Oneplus 6
Oneplus 6

రిసెర్చ్ అండ్ డెవలెప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుతో పాటు వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్ ద్వారా ఆఫ్‌లైన్ మార్కెట్ విస్తరణ చేపట్టబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. వన్‌ప్లస్ సంస్థకు ఇప్పటికే హైదారాబాద్ లో ఒక ఎక్స్ క్లూజివ్ సర్వీస్ సెంటర్ ఉంది. దీంత పాటు క్రోమా అలానే రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌తో వన్‌ప్లస్ ఒప్పందం కొనసాగుతోంది. ఇండియన్ మార్కెట్‌ను మరింతగా అడాప్ట్ చేసుకునేందుకు ఈ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఉపయోగపడుతుందని వన్‌ప్లస్ భావిస్తోంది.

Oneplus 6t Thunder Purple Edition
Oneplus 6t Thunder Purple Edition

హైదరాబాద్‌లో నెలకొల్పబోయే రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లలో కొత్త టాలెంట్‌కు అవకాశమిచ్చే క్రమంలో ఐఐటి ఢిల్లీ, ఐఐటి ముంబయ్ వంటి ప్రధాన విశ్వవిద్యాలయాల్లో హైరింగ్ ప్రోగ్రామ్స్‌ను నిర్వహించినట్లు వన్‌ప్లస్ తెలిపింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) రివీల్ చేసిన వివరాల ప్రకారం 2018, రెండవ క్వార్టర్‌కు గాను ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సామ్ సంగ్, యాపిల్ వంటి ప్రముఖ బ్రాండ్ లను వెనక్కినెట్టి ఏకంగా 40 శాతం వాటాను వన్ ప్లస్ సొంతం చేసుకోగలిగింది. ఇదే సమయంలో నార్త్ అమెరికాలోనూ వన్ ప్లస్ తన ప్రభంజనాన్ని కొనసాగించింది. ఇటీవల మార్కెట్లో లాంచ్ చేసిన వన్ ప్లస్ 6టీకి సంబంధించి త్వరలోనే మెక్ లారెన్ స్పెషల్ ఎడిషన్‌ను కూడా వన్‌ప్లస్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.