India IT sector చచ్చిపోతుందున్నారు, ఆ తరువాత ఏం జరిగింది?

Indian IT
Indian IT చచ్చిపోతుందున్నారు, ఆ తరువాత ఏం జరిగింది?

బ్లూంబర్గ్ అంచనాలను తారుమారు చేస్తూ ఇండియన్ ఐటీ అనూహ్యంగా పుంజుకుంది. 2018లో టీసీఎస్ (TCS) రెండు అంకెల అభివృద్థిని నమోదు చేయగా ఇన్ఫోసిస్ (Infosys) ట్రేడ్ పండితుల అంచనాలను బీట్ చేయగలిగింది. రోబోటిక్స్ ఇంకా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు వేలాది ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాయని, 2016లో గ్లోబల్ న్యూస్ ఏజెన్సీ  బ్లూంబర్గ్ (Bloomberg) ఓ షాకింగ్ రిపోర్టును పోస్ట్ విషయం తెలిసిందే.

వాస్తవానికి,  2017 నుంచి 2018 మధ్య ఎన్నో కఠినమైన సవాళ్లను ఇండియన్ ఐటీ ధీటుగా ఎదుర్కోగలిగింది. ఉద్యోగాల కోత దగ్గర నుంచి ఎంప్లాయ్ ట్రెయినింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో అనేక మార్పుచేర్పులను ఇండియన్ ఐటీ కంపెనీలు అమలు చేసాయి. 2018లో ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో ఏ విధమైన మార్పు చేర్పులు చోటుచేసుకున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…

Indian IT చచ్చిపోతుందున్నారు, ఆ తరువాత ఏం జరిగింది?
Infosys

ఇండియన్ ఐటీ సెక్టార్‌లో ఈ ఏడాదికిగాను చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులలో లోకల్ హైరింగ్ ఒకటి. దేశవిదేశాల్లో కార్యకలాపాలు సాగిస్టోన్న ప్రతి ఇండియన్ ఐటీ కంపెనీ కూడా స్థానికతకు పెద్దపీట వేసే ప్రయత్నం చేసింది. రానున్న రెండు సంవత్సరాలకుగాను 10,000 మంది అమెరికన్లను హైర్ చేసుకోబోతున్నట్లు  ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఇదే సమయంలో కాగ్నిజెంట్ కూడా 25,000 మందిని హైర్ చేసుకోబోతున్నట్లు తెలపింది. టీసీఎస్, విప్రో వంటి దిగ్గజ ఐటీ సంస్థలు సైతం లోకల్ హైరింగ్ టాప్ ఎజెండాగా ఉంచాయి.

లోకల్ మార్కెట్లకు ప్రాధాన్యతను కల్పించే క్రమంలో ఇండియన్ ఐటీ కంపెనీలు ఇండియన్ ఎంప్లాయిస్‌ను తగ్గించుకోవల్సి వచ్చింది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే కాగ్నిజెంట్. 2017 చివరి నాటికి ఈ సంస్థలో మొత్తం 2,60,000 మంది ఉద్యోగులు ఉండే వారు. వీరిలో 1,80,000 మంది భారతీయులే. 2016తో కంపేర్ చేసినట్లయితే ఇండియన్ ఎంప్లాయిస్ సంఖ్య 8,000కు తగ్గింది. ఇదే సమయంలో కంపెనీ యూఎస్ ఇంకా యూరోప్ హెడ్‌కౌంట్‌లు 2900, 2300 చొప్పున పెరిగాయి.  

యూఎస్ ప్రభుత్వం హెచ్-1బి వీసాలను మరింత కఠినతరం చేసిన నేపథ్యంలో దేశంలోని లోకల్ టాలెంట్‌కు కొరతే ఏర్పడింది. దీంతో చాలా వరకు ఐటీ కంపెనీలు చాలా వరకు పని భారాన్ని ఆఫ్‌షోర్‌కు మూవ్ చేస్తున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇన్ఫోసిన్ 71% వర్క్‌ను ఆఫ్‌షోర్ నుంచే హ్యాండిల్ చేస్తోంది. ఇదే సమయంలో విప్రో, టీసీఎస్ వంటి సంస్థలు కూడా ఇదే దిశగా ఆలోచన చేస్తున్నాయి.

గత రెండు సంవ్సతరాలుగా చూసినట్లయితే ఇండియన్ ఐటి సర్వీసెస్‌లో వర్క్‌ఫోర్స్ యుటిలైజేషన్ అనేది మరింతగా మెరుగుపడింది. అయితే, కొన్ని సవాళ్లు మాత్రం ఇండియా ఐటీని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రైసింగ్ ప్రెజర్ అనేది మరింతగా పెరిగిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.