Facebook కొనుగోళ్లు, నాటి నుంచి నేటి వరకు..

Facebook కొనుగోళ్లు, నాటి నుంచి నేటి వరకు..

సోషల్ నెట్‌వర్కింగ్ ప్రపంచంలో ఆకాశమే హద్దుగా దూసుకుపోతోన్న ఫేస్‌బుక్ (Facebook) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ వ్యక్తి ఆలోచన, వ్యవస్థగా మారి మానవాళికి ఉపయోగపడుతోన్న తీరు ఫేస్‌బుక్‌లో  మనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.  2004లో ప్రారంభమైన ఫేస్‌బుక్‌ ప్రస్థానం అంచెలంచెలుగా విస్తరించి, నేడు ఓ ప్రభంజనాన్నే సృష్టిస్తోంది.

Facebook Acquisitions Complete List (2018)
Facebook Acquisitions Complete List (2018)

జనవరి, 2018  గణాంకాల ప్రకారం, ఫేస్‌బుక్.. ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మంది మంత్లీ యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. ఫేస్‌బుక్‌, తన వ్యవస్థను మరింతగా బలోపేతం చేసుకునే క్రమంలో అనేక ప్రముఖ కంపెనీలను తనలో కలుపుకుంటూ ముందుకు సాగుతోంది. నాటి నుంచి నేటి వరకు ఫేస్‌బుక్ టేకోవర్ చేసుకున్న కంపెనీల జాబితాలో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను కలుపుకుని 70 పై చిలుకు కంపెనీలు ఉన్నాయి. ఈ మల్టీటేలెంటెడ్ కంపెనీలకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఫేస్‌బుక్ మొట్టమొదటి కొనుగోలు 2005లో జరిగింది. బోస్టన్‌కు చెందిన అబౌట్‌ఫేస్ కార్పొరేషన్‌ (AboutFace Corporation)ను 2 లక్షల డాలర్లను వెచ్చించి ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.  ఈ సంస్థను కొనుగోలు చేసిన తరువాత Thefacebook.com కాస్తా Facebook.comలా రూపాంతరం చెందింది. వాస్తవానికి, అబౌట్‌ఫేస్ కార్పొరేషన్‌  Facebook.com పేరుతో తన సాఫ్ట్‌వేర్ సర్వీసులను అమ్ముకునేది. 2005, సెప్టంబర్ 20వ తేదీన ఈ పేరును మార్క్ జూకర్‌బర్గ్ నేతృత్వంలోని దఫేస్‌బుక్.కామ్(Thefacebook.com) వసం చేసుకుంది.

ఫేస్‌బుక్ తన రెండవ కొనుగోలును 2007, జూలైలో చేపట్టింది. ఫేస్‌బుక్ మొబైల్‌ నిమిత్తం కాలిఫోర్నియాలోని మౌంటెయిన్‌వ్యూ నగరానికి చెందిన పారాకీ (Parakey) అనే ఆఫ్‌లైన్ అప్లికేషన్స్ సంస్థను సొంతం చేసుకుంది. ఈ డీల్ విలువ తెలియదు.

ఫేస్‌బుక్ తన మూడవ కొనుగోలును 2008, జూన్‌లో చేపట్టింది. కేంబ్రిడ్జ్‌కు చెందిన సోషల్ నెట్‌వర్కింగ్ కంపెనీ కనెక్ట్‌యూ (ConnectU)ను దాదాపుగా 31 మిలియన్ డాలర్లను వెచ్చించి ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.

Facebook Acquisitions Complete List (2018)
Facebook Acquisitions Complete List (2018)

ఫేస్‌బుక్ తన నాలుగవ కొనుగోలును ఆగష్టు,2009లో చేపట్టింది. కాలిఫోర్నియాలోని మౌంటెయిన్‌వ్యూ నగరానికి చెందిన సోషల్ నెట్‌వర్కింగ్ అగ్రిగేటర్ ఫ్రెండ్‌ఫీడ్ (FriendFeed)ను 47.5 మిలియన్ డాలర్లను వెచ్చించి ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్ తన 5వ కొనుగోలును ఫిబ్రవరి, 2010లో చేపట్టింది. మలేషియాకు చెందిన ఆక్టాజెన్ (Octazen) అనే కాంటాక్ట్ ఇంపోర్టర్‌ సంస్థను ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది. డీల్ విలువ తెలియాల్సి ఉంది.

ఫేస్‌బుక్ తన 6వ కొనుగోలును మార్చి, 2010లో చేపట్టింది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన Divvyshot అనే ఫోటో మేనేజ్‌మెంట్ సంస్థను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది.

ఫేస్‌బుక్ తన 7వ కొనుగోలును మే, 2010లో చేపట్టింది. కాలిఫోర్నియాలోని మౌంటెయిన్‌వ్యూ నగరానికి చెందిన ఫ్రెండ్స్‌టర్ అనే ఇంటలెక్ట్యుల్ ప్రాపర్టీ అండ్ పేటెంట్స్ సంస్థను 40 మిలియన్ డాలర్లను వెచ్చించి ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్ తన 8వ కొనుగోలును మే, 2010లో చేపట్టింది. అమెరికాలోని శాన్ మాటోకు చెందిన షేర్‌గ్రోవ్ (ShareGrove) అనే ప్రయివేట్ కన్వర్జేషన్స్ ఇంకా ఫోరమ్స్ కంపెనీని ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది.

Facebook Acquisitions Complete List (2018)
Facebook Acquisitions Complete List (2018)

ఫేస్‌బుక్ తన 9వ కొనుగోలును జూలై, 2010లో చేపట్టింది. అమరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన నెక్స్ట్‌స్టాప్ (Nextstop) అనే ట్రావెట్ రికమండేషన్స్ కంపెనీని 25 లక్షల డాలర్ల వెచ్చించి ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్ తన 10వ కొనుగోలును ఆగష్టు 15, 2010న చేపట్టింది. అమెరికాలోని మంటేయిన్‌వ్యూకు చెందిన ఛాయ్ ల్యాబ్స్ (Chai Labs) అనే ఇంటర్నెట్ అప్లికేషన్స్ కంపెనీని 10 మిలియన్ డాలర్లను వెచ్చించి ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్ తన 11వ కొనుగోలును ఆగష్టు 20, 2010న చేపట్టింది. అమెరికాలోని బ్రోక్లిన్ నగరానికి చెందిన హాటో పొటేటో (Hot Potato) అనే చెక్-ఇన్స్ అలానే స్టేటస్ అప్‌డేట్స్ కంపెనీని 10 మిలియన్ డాలర్లను వెచ్చించి ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్ తన 12వ కొనుగోలును అక్టోబర్ 29, 2010న చేపట్టింది. అమెరికాలోని డుంబోకు చెందిన డ్రాప్.ఐఓ (Drop.io) అనే ఫైల్ హోస్టింగ్ అండ్ షేరింగ్ కంపెనీని కంపెనీని 10 మిలియన్ డాలర్లను వెచ్చించి ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్ తన 13వ కొనుగోలును నవంబర్ 15, 2010న చేపట్టింది. యూఎస్ఏలోని వాషింగ్‌టన్ నగరానికి చెందిన అమెరికన్ ఫాం బ్యూరో ఫెడరేషన్‌కు చెందిన ఎఫ్‌బి.కామ్ (FB.com) అనే డొమైన్ నేమ్‌ను 8.5 మిలియన్ డాలర్లను వెచ్చించి ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.

Facebook Acquisitions Complete List (2018)
Facebook Acquisitions Complete List (2018)

ఫేస్‌బుక్ తన 14వ కొనుగోలును జనవరి 15, 2011న చేపట్టింది. అమెరికాలోని సియాటిల్ నగరానికి చెందిన రిలేషన్ (Rel8tion) అనే మొబైల్ అడ్వర్టైజింగ్ కంపెనీని ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది.

ఫేస్‌బుక్ తన 15వ కొనుగోలును మార్చి 2, 2011న చేపట్టింది. అమెరికాలోని పాలో అల్టోకు చెందిన బెలుగా (BELUGA) అనే గ్రూప్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది.

ఫేస్‌బుక్ తన 16వ కొనుగోలును మార్చి 20, 2011న చేపట్టింది. ఇజ్రాయిల్‌కు చెందిన స్నాప్టు (Snaptu) అనే మొబైల్ యాప్ డెవలపర్‌ను 70 మిలియన్ డాలర్లను వెచ్చించి ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్ తన 17వ కొనుగోలును మార్చి 24, 2011న చేపట్టింది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరానికి చెందిన కంప్యూటర్ విజన్ (Computer vision) సంస్థ రిక్‌రిక్ (RecRec)ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది.

ఫేస్‌బుక్ తన 18వ కొనుగోలును ఏప్రిల్ 27, 2011న చేపట్టింది. అమెరికాలోని సోహో నగరానికి చెందిన డేటమ్ (DayTum) అనే ఇన్ఫర్మేషన్ గ్రాఫిక్స్ కంపెనీని ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది.

Facebook Acquisitions Complete List (2018)
Facebook Acquisitions Complete List (2018)

ఫేస్‌బుక్ తన 19వ కొనుగోలును జూన్ 9, 2011న చేపట్టింది. నెథర్లాండ్స్‌కు చెందిన సోఫా (SOFA) అనే సాఫ్ట్‌వేర్ డిజైన్ కంపెనీని ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది.

ఫేస్‌బుక్ తన 20వ కొనుగోలును కూడా అదే రోజైన జూన్ 9, 2011న చేపట్టింది. న్యూయార్క్‌కు చెందిన ఈ-మెయిల్ ప్రయోరిటైజేషన్ సంస్థ మెయిల్‌ర్యాంక్ (MailRank)ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది.

ఫేస్‌బుక్ తన 21వ కొనుగోలును కూడా ఆగష్టు 2, 2011న చేపట్టింది. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన పుష్ పాప్ ప్రెస్ (Push Pop Press) అనే డిజిటల్ పబ్లిషింగ్ కంపెనీని ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు వెల్లడించలేదు.

ఫేస్‌బుక్ తన 22వ కొనుగోలును కూడా అక్టోబర్ 10, 2011న చేపట్టింది. అమెరికాలోని మౌంటెయిన్ వ్యూకు చెందిన ఫ్రెండ్.లీ (Friend.ly) అనే సోషల్ క్యాజువల్ క్విచ్చిన్ అండ్ ఆన్సర్ సోషల్ యాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు వెల్లడికాలేదు.

ఫేస్‌బుక్ తన 23వ కొనుగోలును నవంబర్ 8, 2011న చేపట్టింది. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన స్ట్రోబ్(Strobe) అనే హెచ్‌టిఎమ్ఎల్ 5 మొబైల్ యాప్స్, స్పౌట్ కోర్ సంస్థను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

Facebook Acquisitions Complete List (2018)
Facebook Acquisitions Complete List (2018)

ఫేస్‌బుక్ తన 24వ కొనుగోలును డిసెంబర్ 2, 2011న చేపట్టింది. అమెరికాలోని అస్టిన్ నగరానికి చెందిన గొవల్లా (Gowalla) అనే లొకేషన్ బేసిడ్ సర్వీసును ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 25వ కొనుగోలును ఫిబ్రవరి 20, 2012న చేపట్టింది. కారిఫోర్నియాకు చెందిన కేఫీనేటెడ్‌మైండ్ (Caffeinatedmind) మైండ్ అనే ఇన్-బ్రౌజర్ ఫైల్ ట్రాన్స్‌ఫర్ సంస్థను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 26వ కొనుగోలును ఏప్రిల్ 9, 2012న చేపట్టింది. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)ను బిలియన్ డాలర్లను వెచ్చించి ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్ తన 27వ కొనుగోలును ఏప్రిల్ 13, 2012న చేపట్టింది. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన కస్టమర్ లాయల్టీ యాప్ ట్యాగ్‌టైల్ (Tagtile)ను సంస్థను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 28వ కొనుగోలును మే 5, 2012న చేపట్టింది. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన సోషల్ డిస్కవరీ ప్లాట్‌ఫామ్ గ్లాన్సీ (Glancee)ని ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

Facebook Acquisitions Complete List (2018)
Facebook Acquisitions Complete List (2018)

ఫేస్‌బుక్ తన 29వ కొనుగోలును మే 15, 2012న చేపట్టింది. లండన్‌కు చెందిన ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ లైట్‌బాక్స్.కామ్ (Lightbox.com)ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 30వ కొనుగోలును మే 21, 2012న చేపట్టింది. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన కర్మ (Karma) అనే సోషల్ గిఫ్టింగ్ ఫ్లాట్‌ఫామ్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 31వ కొనుగోలును జూన్ 18, 2012న చేపట్టింది. ఇజ్రాయిల్‌కు చెందిన ఫేస్.కామ్ (Face.com) అనే ఫేస్ రికగ్నిషన్ ఫ్లాట్‌ఫామ్‌ను 100 మిలియన్ డాలర్లను వెచ్చింది ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్ తన 32వ కొనుగోలును జూలై 14, 2012న చేపట్టింది. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన స్పూల్ (Spool) అనే మొబైల్ బుక్‌మార్కింగ్ అండ్ షేరింగ్ కంటెంట్ ఫ్లాట్‌ఫామ్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 33వ కొనుగోలును జూలై 20, 2012న చేపట్టింది. కెనడాకు చెందిన ఆక్రైలిక్ సాఫ్ట్‌వేర్ (Acrylic Software) అనే ఆర్ఎస్ఎస్ యాప్ పల్ప్ అండ్ సెక్యూర్ డేటా బేస్ యాప్ వాలెట్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

Facebook Acquisitions Complete List (2018)
Facebook Acquisitions Complete List (2018)

ఫేస్‌బుక్ తన 34వ కొనుగోలును ఆగష్టు 24, 2012న చేపట్టింది. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన త్రెడ్‌సీ (Threadsy) అనే సోషల్ అగ్రిగేటర్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 35వ కొనుగోలును ఫిబ్రవరి 28, 2013న చేపట్టింది. సియాటిల్‌కు చెందిన అట్లాస్ సొల్యూషన్స్ (Atlas Solutions) అనే అట్లాస్ అడ్వర్టైజర్ సూట్‌ను 100 మిలియన్ కంటే తక్కువ డాలర్లకు ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్ తన 36వ కొనుగోలును మార్చి, 2013న చేపట్టింది. అమెరికాలోని మౌంటెయిన్‌వ్యూకు చెందిన వోస్మెటా
(osmeta)  అనే మొబైల్ సాఫ్ట్‌వేర్ కంపెనీని ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 37వ కొనుగోలును మార్చి 14, 2013న చేపట్టింది. న్యూయార్క్‌కు చెందిన హాట్ స్టూడియో (Hot Studio) అనే డిజైన్ ఏజెన్సీని ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 38వ కొనుగోలును ఏప్రిల్ 23, 2013న చేపట్టింది. యూఎస్ఏలోని బర్లింగ్ గేమ్‌కు చెందిన స్పేస్‌క్రాఫ్ట్ (Spaceport) అనే క్రాస్-ఫ్లాట్‌ఫామ్ గేమ్ ఫ్రేమ్‌వర్క్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 39వ కొనుగోలును ఏప్రిల్ 25, 2013న చేపట్టింది. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన పేర్స్ (Parse) అనే మొబైల్ యాప్ బ్యాకెండ్స్  85 మిలియన్ డాలర్లను వెచ్చించి ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.

Facebook Acquisitions Complete List (2018)
Facebook Acquisitions Complete List (2018)

ఫేస్‌బుక్ తన 40వ కొనుగోలును జూలై 18, 2013న చేపట్టింది. లండన్‌కు చెందిన మోనోఇడిక్స్ (Monoidics)  అనే ఆటోమెటిక్ వెరిఫికేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 41వ కొనుగోలును ఆగష్టు 12, 2013న చేపట్టింది. యూఎస్ఏలోని పిట్స్‌బర్గ్ ప్రాంతానికి చెందిన జిబ్బిగో (Jibbigo) అనే  స్పీచ్ ట్రాన్స్‌లేషన్ యాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 42వ కొనుగోలును అక్టోబర్ 13, 2013న చేపట్టింది. ఇజ్రాయిల్‌కు చెందిన ఒనావో (Onavo) అనే మొబైల్ అనాలిటిక్స్ ఇంకా ఇజ్రాయిల్ ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయాన్ని ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 43వ కొనుగోలును డిసెంబర్ 13, 2013న చేపట్టింది. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన స్పోర్ట్‌స్ట్రీమ్ (SportStream) అనే స్పోర్ట్స్ కన్వర్జేషన్ అనాలిసిస్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 44వ కొనుగోలును జనవరి 8, 2014న చేపట్టింది. బెంగుళూరుకు చెందిన  లిటిల్ ఐ ల్యాబ్స్ (Little Eye Labs) అనే పెర్ఫామెన్స్ అనాలిసిస్ అండ్ మానిటరింగ్ టూల్స్ సంస్థను 15 మిలియన్ డాలర్లను వెచ్చించి ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.

Facebook Acquisitions Complete List (2018)
Facebook Acquisitions Complete List (2018)

ఫేస్‌బుక్ తన 45వ కొనుగోలును జనవరి 13, 2014న చేపట్టింది. న్యూయార్క్‌కు చెందిన బ్రాంచ్ (Branch) అనే వెబ్ కన్వర్జేషన్ ప్లాట్‌ఫామ్‌ను 15 మిలియన్ డాలర్లను వెచ్చించి ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్ తన 46వ కొనుగోలును ఫిబ్రవరి 19, 2014న చేపట్టింది. మౌంటెయిన్ వ్యూకు చెందిన ఇన్‌స్టెంట్ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ (WhatsApp)ను 19 బిలియన్ డాలర్లను వెచ్చించి ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్ తన 47వ కొనుగోలును మార్చి 25, 2014న చేపట్టింది. అమెరికాలోని ఇర్వైన్ ప్రాంతానికి చెందిన ఓకులస్ వీఆర్ (Oculus VR) అనే వర్చువల్ రియాల్టీ టెక్నాలజీని 2 బిలియన్ డాలర్లను వెచ్చించి ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్ తన 48వ కొనుగోలును మార్చి 27, 2014న చేపట్టింది. యూకేలోని సోమర్‌సెట్‌కు అసెంటా (Ascenta) అనే హై-యాటిట్యూడ్ అన్‌మ్యానుడ్ ఏరియల్ వెహికల్ తయారీ సంస్థను 20 మిలియన్ డాలర్లను వెచ్చించి  ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్ తన 49వ కొనుగోలును ఏప్రిల్ 24, 2014న చేపట్టింది. ఫిన్‌ల్యాండ్‌లోని హెల్సింకి ప్రాంతానికి చెందిన  ప్రోటోజియో ఓయ్ (ProtoGeo Oy) అనే ఫిట్నెస్ ట్రాకింగ్ యాప్ మూవ్స్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

Facebook Acquisitions Complete List (2018)
Facebook Acquisitions Complete List (2018)

ఫేస్‌బుక్ తన 50వ కొనుగోలును ఆగష్టు 7, 2014న చేపట్టింది. యూఎస్ఏలోని పాలో ఆల్టోకు చెందిన ప్రయివేట్‌కోర్ (PrivateCore) అనే సెక్యూర్ సర్వర్ టెక్నాలజీ సంస్థను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 51వ కొనుగోలును ఆగష్టు 14, 2014న చేపట్టింది. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన లైవ్‌రెయిల్ (LiveRail) అనే పబ్లిషర్ మానిటైజేషన్ ప్లాట్‌ఫామ్‌ను 500 మిలియన్ డాలర్లను వెచ్చించి ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్ తన 52వ కొనుగోలును ఆగష్టు 26, 2014న చేపట్టింది. అమెరికాలోని బర్లింగ్‌గేమ్ ప్రాంతానికి చెందిన వేవ్‌గ్రూప్ సౌండ్ (WaveGroup Sound) అనే సౌండ్ స్టూడియోను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 53వ కొనుగోలును జనవరి 6, 2015న చేపట్టింది. అమెరికాలోని పాలో ఆల్టో ప్రాంతానికి చెందిన విట్.ఏఐ (Wit.ai) అనే స్పీక్ రికగ్నిషన్ ఫ్లాట్‌ఫామ్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 54వ కొనుగోలును జనవరి 8, 2015న చేపట్టింది. అమెరికాలోని శాన్‌డిగో ప్రాంతానికి చెందిన క్విక్‌ఫైర్ నెట్‌వర్క్స్ (Quickfire Networks)  అనే వీడియో కంప్రెషన్ ప్లాట్‌ఫామ్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

Facebook Acquisitions Complete List (2018)
Facebook Acquisitions Complete List (2018)

ఫేస్‌బుక్ తన 55వ కొనుగోలును మార్చి 14, 2015న చేపట్టింది. అమెరికాలోని మౌంటెయిన్‌వ్యూ ప్రాంతానికి చెందిన దఫైండ్,ఇంక్. (TheFind, Inc.) అనే ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 56వ కొనుగోలును మే 26, 2015న చేపట్టింది. లండన్‌కు చెందిన సర్రియల్ విజన్ (Surreal Vision) అనే కంప్యూటర్ విజన్, ఆగ్మంటెడ్ రియాల్టీ ప్లాట్‌ఫామ్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 57వ కొనుగోలును జూలై 16, 2105న చేపట్టింది. ఇజ్రాయిల్‌కు చెందిన పెబ్బిల్స్ (Pebbles) అనే కంప్యూటర్ విజన్, ఆగ్మంటెడ్ రియాల్టీ ప్లాట్‌ఫామ్‌ను 60 మిలియన్ డాలర్లను వెచ్చించి ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్ తన 58వ కొనుగోలును అక్టోబర్ 3, 2015న చేపట్టింది. అమెరికాలోని ఓక్‌ల్యాండ్ ప్రాంతానికి చెందిన ఎండాగా (Endaga) అనే రూరల్ కమ్యూనికేషన్స్ వ్యవస్థను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 59వ కొనుగోలును మార్చి 9, 2016న చేపట్టింది. బిలారస్ దేశానికి చెందిన మాస్కురేడ్ (Masquerade) అనే విజువల్ ఎఫెక్ట్స్ (ఫేస్-స్వాపింగ్) కంపెనీని ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 60వ కొనుగోలును మే 23, 2016న చేపట్టింది. స్కాట్లాండ్‌కు చెందిన టు బిగ్ ఇయర్స్ (Two Big Ears) అనే స్పాటియల్ ఆడియో కంపెనీని ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

Facebook Acquisitions Complete List (2018)
Facebook Acquisitions Complete List (2018)

ఫేస్‌బుక్ తన 61వ కొనుగోలును సెప్టంబర్ 19, 2016న చేపట్టింది. కాలిఫోర్నియాకు చెందిన నాసెంట్ ఆబ్జెక్ట్స్ (Nascent Objects) అనే మాడ్యులర్ ఎలక్ట్రానిక్స్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 62వ కొనుగోలును అక్టోబర్ 10, 2016న చేపట్టింది. ఐర్లాండ్ దేశానికి చెందిన ఇన్ఫినైల్డ్ (Infiniled) అనే ఓకులస్ వీఆర్ ప్లాట్‌ఫామ్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 63వ కొనుగోలును నవంబర్ 11, 2016న చేపట్టింది. యూఎస్ఏకు చెందిన క్రౌడ్‌టాంగిల్ (CrowdTangle) అనే పబ్లిషర్ అనాలిటిక్స్ టూల్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 64వ కొనుగోలును నవంబర్ 16, 2016న చేపట్టింది. యూఎస్ఏలోని పిట్స్‌బర్గ్ ప్రాంతానికి ఫేషియోమెట్రిక్స్ (Faciometrics)  అనే కంప్యూటర్ విజన్, మెచీన్ లెర్నింగ్ సంస్థను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

Facebook Acquisitions Complete List (2018)
Facebook Acquisitions Complete List (2018)

ఫేస్‌బుక్ తన 65వ కొనుగోలును నవంబర్, 2016లో చేపట్టింది. స్విట్జర్లాండ్‌కు చెందిన జురిచ్ ఐ (Zurich Eye) అనే కంపెనీని ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 66వ కొనుగోలును జూలై 31, 2017న చేపట్టింది. యూఎస్ఏలోని పాలో ఆల్టోకు చెందిన ఓజీలో (Ozlo)  అనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 67వ కొనుగోలును ఆగష్టు, 2017లో చేపట్టింది. జర్మనీకి చెందిన ఆగ్మెంటెడ్ రియాల్టీ కంపెనీ ఫేటెక్ ఏజీ (Fayteq AG)  ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 68వ కొనుగోలును అక్టోబర్ 16, 2017న చేపట్టింది. యూఎస్ఏలోని ఓక్‌ల్యాండ్ ప్రాంతానికి చెందిన టీబీహెచ్(tbh) అనే సోషల్ మీడియా యాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఫేస్‌బుక్ తన 69వ కొనుగోలును జనవరి 23, 2018న చేపట్టింది. యూఎస్ఏలోని బోస్టన్ ప్రాంతానికి చెందిన కన్ఫర్మ్ (Confirm) అనే గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడీ వెరిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

Facebook Acquisitions Complete List (2018)
Facebook Acquisitions Complete List (2018)

ఫేస్‌బుక్ తన 70వ కొనుగోలును జూలై, 2018లో చేపట్టింది. లండన్ కు చెందిన Bloomsbury AI అనే ప్లాట్‌ఫామ్‌ను 30 మిలియన్ డాలర్లను వెచ్చించి ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్ తన 71వ కొనుగోలును జూలై 26, 2018న చేపట్టింది. ఇజ్రాయిల్‌కు చెందిన రెడ్‌కిక్స్ అనే టీమ్ మెసేజింగ్ ఈ-మెయిల్ ప్లాట్‌ఫామ్‌ను 100 మిలియన్ డాలర్లను ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్ తన 72వ కొనుగోలును ఆగష్టు 13, 2018న చేపట్టింది. యూఎస్ఏలోని ఉతహ్ ప్రాంతానికి చెందిన విడ్‌ప్రెస్సో (Vidpresso) అనే వీడియో సాఫ్ట్‌వేర్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. డీల్ వివరాలు బయటకు రాలేదు.

ఇవి ఫ్రెండ్స్ ఫేస్‌బుక్ ఇప్పటి వరకు కొనుగోలు చేసిన కంపెనీల వివరాలు. భవిష్యత్‌లో ఈ కొనుగోళ్ల సంఖ్య మరింతగా పెరిగి ఓ సరికొత్త రికార్డను ఫేస్‌బుక్ నెలకొల్పాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.