Snapdragon 855 : 7 ఆసక్తికర విషయాలు

Snapdragon 855
Snapdragon 855 : 7 ఆసక్తికర విషయాలు

ఇటీవల హవాయి (Hawaii) వేదికగా జరిగిన 2018 స్నాప్‌డ్రాగన్ టెక్ సమ్మిట్‌లో భాగంగా క్వాల్కమ్ (Qualcomm) తన నెక్స్ట్ జనరేషన్ స్నాప్‌డ్రాగన్ 855 (Snapdragon 855) మొబైల్ చిప్‌సెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్‌కు అప్‌డేటెడ్ వెర్షన్‌గా లాంచ్ అయిన 855 చిప్‌సెట్‌, పాత వెర్షన్స్‌తో పోలిస్తే మేజర్ ఇంప్రూవ్‌మెంట్స్‌ను కలిగి ఉంది. 

ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను ఉద్దేశించి క్వాల్కమ్ అభివృద్థి చేసిన స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్‌ను 2019లో లాంచ్ కాబోతోన్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్10, వన్‌ప్లస్ 7 వంటి హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్విప్ చేయబోతున్నారు. ఈ చిప్‌సెట్‌ గురించిన 7 ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Snapdragon 855: 7 ఆసక్తికర విషయాలు

45 రెట్ల వేగవంతమైన పనితీరు..

క్వాల్కమ్ బ్రాండ్ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతీ చిప్‌సెట్ కూడా పనితీరును పరంగా రెట్టింపు ఫలితాలను నమోదు చేసింది. క్వాల్కమ్ చెబుతోన్న దాని ప్రకారం స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్‌తో పోలిస్తే 855 చిప్‌సెట్‌ కూడా 45 శాతం వేగవంతమైన పనితీరును ఆఫర్ చేయగలుగుతుందట. 7ఎన్ఎమ్ ప్రాసెస్ పై బిల్ట్ కాబడిన ఈ చిప్‌సెట్‌ మెరుగైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందట. 

త్రీ-క్లస్టర్ డిజైన్‌తో వస్తోన్న స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్‌ Kryo 485 సీపీయూతో ఫీచరై ఉంటుంది. ఈ సీపీయూలో ప్రైమ్ కోర్ అయిన్ కార్టెక్స్ ఏ76 2.84GHz క్లాక్ వేగంతో స్పందిస్తుంది. మరో మూడు 
కార్టెక్స్ ఏ76 కోర్స్ 2.42GHz క్లాక్ వేగంతో స్పందించగలుగుతాయి. మిగిలిన నాలుగు కార్టెక్స్ ఏ55 కోర్స్ 1.8GHz క్లాక్ వేగంతో రెస్పాండ్ అవుతాయి. ఈ చిప్‌సెట్‌తో అటాచ్ చేసిన న్యూవెర్షన్ అడ్రినో 640 జీపీయూ మునుపటి వెర్షన్‌తో పోలిస్తే 20 శాతం అదనపు పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేయగలుగుతుందట. 

Snapdragon 855: 7 ఆసక్తికర విషయాలు

వేగవంతమైన వై-ఫై ఇంకా ఎల్‌టీఈ..

ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలించిట్లయితే, మనలో చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఇంటర్నెట్ సర్ఫింగ్, వీడియో స్ట్రీమింగ్, వీడియో గేమింగ్ అవసరాల రిత్యా వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టువిటీని కోరుకుంటున్నారు. ఇటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని క్వాల్కమ్ తన 855 చిప్‌సెట్‌ను 
X24 LTE (Cat.20) మోడెమ్ పై బిల్ట్ చేసింది.

ఈ మోడమ్ 2జీబీపీఎస్ స్పీడ్స్ వరకు సపోర్ట్ చేయగలదట. స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్‌కు సంబంధించి వై-ఫై మోడెమ్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసినట్లు క్వాల్కమ్ చెబుతోంది. ఈ చిప్‌సెట్‌లో ఏర్పాటు చేసిన Wi-Fi 6 (802.11ax) మోడెమ్ ఇంకా 60GHz Wi-Fi 802.11ay  వ్యవస్థలు 10Gbps వరకు స్పీడ్స్‌ను అందుకోగలుగుతాయట. 

Snapdragon 855: 7 ఆసక్తికర విషయాలు

5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది..

భవిష్యత్ నెట్‌వర్క్ కనెక్టువిటీని దృష్టిలో ఉంచుకుని క్వాల్కమ్ తన స్నాప్‌డ్రాగన్ 855 సాక్‌కు 
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్50 5జీ మోడెమ్‌తో పాటు 5జీ నెట్‌వర్క్‌ను ఎనేబుల్ చేసుకునే అవసరమైన mmWave మాడ్యుల్‌ను కూడా పెయిర్ చేసింది.

ఇటీవల, ప్రపంచపు మొట్టమొదటి 5జీ అప్‌గ్రేడబుల్ స్మార్ట్‌ఫోన్ అయిన మోటో జెడ్3 (Moto Z3)ని 5జీ మోటో మోడ్ (5G Moto Mod)తో అటాచ్ చేసి 5జీ నెట్‌వర్క్ స్పీడ్‌ను టెస్ట్ చేసి చూడగా 1జీబి సామర్థ్యం గల ఫైల్ 18 సెకన్ల కంటే తక్కువ సమయంలో డౌన్‌లోడ్ అవ్వటం విశేేషం.

5జీ నెట్‌వర్క్ పై ఇప్పటికే దృష్టిసారించిన షావోమి, వన్‌ప్లస్ వంటి బ్రాండ్‌లు స్నాప్‌డ్రాగన్ 855 సాక్‌తో ఎక్విప్ అయి ఉండే స్మార్ట్‌ఫోన్‌లను 2019లో మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో సామ్‌సంగ్ కూడా ఓ స్పెషల్ ఎడిషన్ గెలాక్సీ ఎస్10 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకు రాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. 

ఇండియన్ మార్కెట్లో 5జీ నెట్‌వర్క్ హడావుడి ఇప్పుడప్పుడే లేదా కాబట్టి యాఎస్, చైనా, సౌత్ కొరియా, యూకే ఇంకా ఆస్ట్రేలియా దేశాల్లో మాత్రమే ఈ అప్‌కమ్మింగ్ 5జీ ఫోన్‌లకు క్రేజ్ ఉండే అవకాశముంది. 

పోర్ట్రెయిట్ మోడ్‌లోనూ లైవ్ 4కే వీడియో రికార్డింగ్..

ప్రస్తుత ట్రెండ్‌ను మనం చూసినట్లయితే చాలా వరకు ఫోటోస్ అలానే వీడియోస్ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే క్యాప్చుర్ చేయబడుతున్నాయి. డ్యుయల్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చిన తరువాత పోర్ట్రెయిడ్ మోడ్‌ను ఉపయోగించుకుని బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేసి సబ్జెక్ట్‌ను ఫోకస్ చేయటమనేది పాపులర్‌గా మారిపోయింది.

ఈ క్రేజ్‌ను దృషిలో పెట్టుకున్న క్వాల్కమ్, తన స్నాప్‌డ్రాగన్ 855సాక్ ద్వారా 4కే వీడియోలను లైవ్ పోర్ట్రెయిట్ మోడ్‌లో రికార్డ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ అప్‌డేట్‌తో స్నాప్‌డ్రాగన్ 855 సాక్‌తో రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లు డీఎస్ఎల్ఆర్ కెమెరాలకు థీటుగా వీడియో రికార్డింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్చేస్తాయి. ముఖ్యంగా ఈ ఫీచర్ మొబైల్ ఫిల్మ్‌మేకర్స్‌కు మరింతగా ఉపయోగపడుతుంది. 

అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్..

ఎడ్జ్ టు ఎడ్జ్డిస్‌ప్లేలు అందుబాటులోకి వచ్చిన తరువాత పలు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌లను ఫోన్ వెనుక భాగాలకు లేదా సైడ్ భాగాలకు షిప్ట్ చేయటం జరుగుతోంది. అయితే, క్రియేటవ్‌గా ఆలోచిస్తోన్న ఒప్పో, వివో, వన్ ప్లస్, హువావే వంటి బ్రాండ్‌లు మాత్రం అండర్ –డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్‌కే ఎక్కువుగా ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ఏదేమైనప్పటికి ఈ ఆప్టికల్ సెన్సార్స్ ఖచ్చితత్వం విషయంలో ఫిజికల్సెన్సార్‌తో పోటీపడలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలో క్వాల్కమ్ అనౌన్స్ చేసిన 3డీ సోనిక్ సెన్సార్, ఫాస్టర్ ఇంకా సెక్యూర్ స్ర్కీన్ అన్‌లాకింగ్‌కు చక్కటి పరిష్కారమని తెలుస్తోంది.  

Snapdragon 855: 7 ఆసక్తికర విషయాలు

మరిన్ని హై-క్వాలిటీ ఫోటోలను స్టోర్ చేసుకునే అవకాశం..

ఐఓఎస్ 11 ప్లాట్‌ఫామ్ ద్వారా ఆపిల్ (Apple) పరిచయం చేసిన HEIF (హై-ఎఫీషియన్సీ ఇమేజ్ ఫార్మాట్) కోడిక్ JPEGతో కంపేర్ చేసిన చూసినట్లయితే ఫోటోలను స్క్వీజ్ చేయటంతో పాటు అదే విధమైన క్వాలిటీని మెయింటేన్ చేస్తుంది. ఇప్పుడు ఇదే విధమైన ఫార్మాట్ స్నాప్‌డ్రాగన్ 855 సాక్‌ను కూడా సపోర్ట్ చేయబోతోంది. ఈ కోడిక్, ఫోన్ స్టోరేజ్‌ను మరింత ఆదా చేయటంతో పాటు క్వాలిటీ ఏమాత్రం  దెబ్బతినకుండా చూస్తుంది.

Snapdragon 855: 7 ఆసక్తికర విషయాలు

ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్..

రద్దీ ప్రాంతాల్లోఉన్నప్పుడు ఫోన్‌లో సమాధానం చెప్పటం చాలా కష్టతరంగా అనిపిస్తుంది. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా క్వాల్కమ్ తన స్నాప్ డ్రాగన్ 855 ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నాయిస్ క్యాన్సిలింగ్  ఫీచర్‌ను అందిస్తోంది. చాలా స్మార్ట్‌గా వ్యవహిరించే ఈ ఫీచర్ యాంబియంట్ నాయిస్‌ను పూర్తిగా బ్లాక్ చేసి వాయిస్ క్లియర్‌గా వినిపించేలా చూస్తుంది. ఇదే సమయంలో ఈ సాక్ గూగుల్ అలానే అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌లను సపోర్ట్ చేస్తుంది. అంతరాయంలేని బ్లుటూత్ కనెక్టువిటీ నిమిత్తం AptXAdaptive audio కోడిక్‌ను ఈ సాక్ అందిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.