షియోమీ నుంచి కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్.. Redmi 6, Redmi 6A, Redmi 6 Pro

Redmi 6 Pro
Xiaomi Redmi 6, Redmi 6A, Redmi 6 Pro

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ (Xiaomi), భారత్‌లో మరో భారీ లాంచ్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. న్యూఢిల్లీ వేదికగా సెప్టంబర్ 5న నిర్వహించబోతోన్న ఓ ఈవెంట్‌లో భాగంగా Redmi 6, Redmi 6A, Redmi 6 Pro స్మార్ట్‌ఫోన్‌లను షియోమీ లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ ఫోన్‌లకు సంబంధించి పలు స్పెసిఫికేషన్స్ ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి కాన్ఫిగరేషన్స్ అలానే కలర్ ఆప్షన్స్ వివరాలను MySmartPrice రివీల్ చేసింది.

నాలుగు రకాల కలర్ వేరియంట్స్..

ఈ వెబ్‌సైట్ పోస్ట్ చేసిన కథనం ప్రకారం ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌ల నాలుగు రకాల కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి. వీటిలో Redmi 6 ఇంకా Redmi 6A డివైస్‌లు బ్లాక్, బ్లు, గోల్డ్ ఇంకా రోజ్ గోల్డ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటాయి. మరో మోడల్ అయిన Redmi 6 Pro బ్లాక్, బ్లు, గోల్డ్ ఇంకా రెడ్ కలర్ ఆప్షన్స్‌లో అదుబాటులో ఉంటుంది.

Also Read : మార్కెట్లోకి మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌లు Motorola One, Motorola One Power

స్టోరేజ్ వేరియంట్స్..

ఇక స్టోరేజ్ స్పెక్స్ విషయానికి వచ్చేసరికి Redmi 6 రెండు రకాల వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటి వేరియంట్ వచ్చేసరికి 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ, రెండవ వేరియంట్ వచ్చేసరికి 3జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ లభ్యమవుతుంది. ఇక Redmi 6A విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ కూడా రెండు రకాల వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

అందులో మొదటి వేరియంట్ వచ్చేసరికి 2జీబి ర్యామ్ + 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ, రెండవ వేరియంట్ వచ్చేసరికి 2జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ అందుబాటులో ఉంటుంది. ఇక మూడవ మోడల్ అయిన Redmi 6 Pro రెండు రకాల వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటి వేరియంట్ వచ్చేసరికి 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ, రెండవ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభ్యమవుతాయి.

Also Read : Honor బ్రాండ్ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది..

ధరల వివరాలు..

షియోమీ Redmi 6 అలానే Redmi 6A స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే చైనా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అక్కడి మార్కెట్లో Redmi 6A ధర 699 yuanలుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.6,300. Redmi 6 32జీబి వేరియంట్ ధర 799 yuanలుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.8,400. Redmi 6 64జీబి వేరియంట్ ధర 999 yuanలుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.10,520.

రెడ్‌మి 6 స్పెసిఫికేషన్స్..

ఈ డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన MIUI 9 స్కిన్ పై రన్ అవుతుంది. ఫోన్ ఇతర స్పెక్స్ పరిశీలించినట్లయితే.. 5.45 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 720×1440 పిక్సల్స్), ఆక్టాకోర్ 12ఎన్ఎమ్ మీడియాటెక్ హీలియో పీ22 సాక్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), డెడికేటెడ్ మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000mAh బ్యాటరీ.

Also Read : Diesel బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్ Full Guard 2.5

రెడ్‌మి 6ఏ స్పెసిఫికేషన్స్..

5.45 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 720×1440 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్-కోర్ 12 ఎన్ఎమ్ మీడియాటెక్ హీలియో ఏ22 సాక్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, డెడికేటెడ్ మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000mAh బ్యాటరీ. చైనా మార్కెట్లో రెడ్‌మి 6ఏ ధర CNY 599గా ఉంది. (ఇండియన్ కరెన్సీలో ఈ విలువ షుమారుగా రూ.6,300)

రెడ్‌మి 6ప్రో స్పెసిఫికేషన్స్..

5.84 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1080×2280 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 9 యూజర్ ఇంటర్‌ఫేస్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 సాక్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), డెడికేటెడ్ మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,000mAh బ్యాటరీ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.