Vivo V11 పై రూ.2000 తగ్గింపు, విడుదలైన 14 రోజులకే మొదటి ప్రైస్ కట్!

Vivo V11
Vivo V11 పై రూ.2000 తగ్గింపు, విడుదలైన కొద్ది రోజులకే మొదటి ప్రైస్ కట్!

వివో (Vivo) లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన వివో వీ11 (Vivo V11) రూ.2000 ధర తగ్గింపును అందుకుంది. సెప్టంబర్ చివరి వారంలో విడుదలైన ఈ డివైస్ ధరను రూ.22,990 నుంచి రూ.20,990కి కంపెనీ తగ్గించింది. మార్కెట్లో ఈ డివైస్‌ను వివో ఈ-స్టోర్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇంకా ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్ విక్రయిస్తున్నాయి.

Also Read : Oppo F9 పై రూ.1000 తగ్గింపు, ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే..

వివో వీ11 (Vivo V11) స్పెసిఫికేషన్స్.. 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ( విత్ 2280 x 1080 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ ఫన్‌టచ్ 4.5 స్కిన్, మీడియాటెక్ హీలియో పీ60 ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిిటీని 256జీబి వరకు ఎక్స్ ప్యాండ్  చేసుకునే అవకాశం.

Also Read : రెడ్ కలర్ వేరియంట్‌లో Poco F1, స్టైల్‌కు తోడు పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్స్..

16 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 25 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3315mAh బ్యాటరీ,  కనెక్టువిటీ ఫీచర్స్ (4జీ ఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వై-ఫై, బ్లుటూత్ 4.2, జీపీఎస్, మైక్రో యూఎస్బీ పోర్ట్), ఫోన్ చుట్టుకొలత 155.97 x 75.63 x 8.1 మిల్లీమీటర్లు, బరువు 163.7 గ్రాములు.

Also Read : Nokia 7.1కు ముహూర్తం ఫిక్స్, అక్టోబర్ 11న అఫీషియల్ లాంచ్, మరో సర్‌ప్రైజ్ కూడా..?

ఇక కాంపీటిషన్ విషయానికి వచ్చేసరికి ఇప్పటికే మార్కెట్లో లభ్యమవుతోన్న షావోమి పోకో ఎఫ్1 (Xiaomi Poco F1) ఇంకా ఒప్పో ఎఫ్9 ప్రో(Oppo F9 Pro)ల నుంచి వివో వీ11కు గట్టిపోటీ ఎదురవుతోంది.

Also Read : అదరగొట్టిన Asus Zenfone Max Pro M1, 6 నెలల్లో 10 లక్షల ఫోన్‌ల అమ్మకాలు..

షావోమి పోకో ఎఫ్1 స్పెసిఫికేషన్స్.. 6.18 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 సాక్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.23,999.

Also Read : సంవత్సరం గ్యాప్ తరువాత Lenovo నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ వస్తోంది..

ఒప్పో ఎఫ్9 ప్రో స్పెసిఫికేషన్స్.. 6.3 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, మీడియాటెక్ హీలియో పీ60 సాక్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 25 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.23,990.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.