2019లో లాంచ్ కాబోతోన్న 5 క్రేజీ స్మార్ట్‌ఫోన్‌లు

Upcoming Smartphones 2019
2019లో లాంచ్ కాబోతోన్న 5 క్రేజీ స్మార్ట్‌ఫోన్‌లు

2018 తుది అంకానికి చేరుకున్న నేపథ్యంలో 2019లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్‌ల పై మార్కెట్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ ఏడాది మనం చూసిననట్లయితే యాపిల్, గూగుల్, సామ్‌సంగ్, వన్‌ప్లస్, నోకియా, షావోమి వంటి ప్రముఖ బ్రాండ్స్ తమతమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను విప్లవాత్మక ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకురావటం జరిగింది.

వీటిలో కొన్ని మోడల్స్ ఆకట్టుకునే ప్రయత్నం చేయగా మరికొన్ని మాత్రం నిరుత్సాహాపరిచాయి. ఫలితాలు ఎలా ఉన్నప్పటికి వీటికి సంబంధించిన అప్‌డేటెడ్ వెర్షన్స్ మాత్రం 2019లో లాంచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

2019లో లాంచ్ కాబోతోన్న 5 క్రేజీ స్మార్ట్‌ఫోన్‌లు
Image Source : T3.Com

ఆపిల్ నాట్చ్-లెస్ డిస్‌ప్లే ఫోన్స్..

2019ని పురస్కరించుకుని కుపెర్టినో టెక్ దిగ్గజం ఆపిల్ సరికొత్త ఐఫోన్ మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. రూమర్ మిల్స్ ద్వారా తెలుస్తోన్న సమాచారం ప్రకారం ఆపిల్ అప్‌కమ్మింగ్ ఐఫోన్‌లు హై-క్వాలిటీ కెమెరాలతో ఎక్విప్ అయి ఉంటాయి. ఇదే సమయంలో నాట్చ్-లెస్ డిస్‌ప్లే ప్యానల్స్‌ను కూడా ఇవి క్యారీ చేస్తాయి.

Image Source : T3.Com

సామ్‌సంగ్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్..

2019కి గాను సామ్‌సంగ్ రెండు సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. గెలాక్సీ ఎస్ సిరీస్ నుంచి లాంచ్ కాబోతోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లు గెలాక్సీ ఎస్10, గెలాక్సీ ఎస్10 ప్లస్ పేర్లతో అందుబాటులో ఉంటాయట. ఈ రెండు ఫోన్‌లలో డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్‌ను మరింతగా మెరుగుపరచటంతో పాటు పలు ఇన్నోవేటివ్ ఫీచర్లను కూడా జోడించినట్లు తెలుస్తోంది.

2019లో లాంచ్ కాబోతోన్న 5 క్రేజీ స్మార్ట్‌ఫోన్‌లు

వన్‌ప్లస్ నుంచి 5జీ ఫోన్..

ఆపిల్, సామ్‌సంగ్, గూగుల్ వంటి దిగ్గజ బ్రాండ్‌లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న  వన్‌ప్లస్, 2019లో ఓ భారీ ఆవిష్కరణకే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ బ్రాండ్ నుంచి లాంచ్ కాబోతోన్న అప్‌కమ్మింగ్ డివైస్ 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది.

Image Source : T3.com

5 వెనుక కెమెరాలతో నోకియా 9

2018లో ఏకంగా 12 కొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసిన నోకియా, 2019లోనూ అదే ట్రెండ్‌ను కొనసాగించే అవకాశముంది. ఈ బ్రాండ్ నుంచి కొత్త ఏడాదిలో లాంచ్ కాబోతోన్న నోకియా 9 పెంటా కెమెరా సెటప్‌తో రాబోతోందట. అంటే, ఈ ఫోన్ వెనుక భాగంలో ఏకంగా 5 కెమెరాలు ఉంటాయి.

Xiaomi 48 Mega Pixel Camera Phone

48 మెగా పిక్సల్ కెమెరాతో షావోమి రెడ్‌మి ప్రో 2

రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం 2019లో షావోమి బ్రాండ్ నుంచి లాంచ్ కాబోతోన్న రెడ్‌మి ప్రో 2 ఏకంగా 48 మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉంటుందట. ఫ్రంట్ డిస్‌ప్లే హోల్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌కు మరో ప్రధానమైన హైలైట్‌గా నిలవనుందట.

Google Pixel Phone

కొత్త సిరీస్ నుంచి గూగుల్ పిక్సల్ స్మార్ట్‌ఫోన్స్

2019కిగాను గూగుల్ ఓ కొత్త సిరీస్‌ను మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు సమాచారం.  ఈ సిరీస్ నుంచి లాంచ్ అయ్యే  పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌లు 2019 ద్వితియార్థంలో కమర్షియల్‌గా లభ్యం కానున్నాయట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.