53 మెగా పిక్సల్ కెమెరాతో Sony Xperia XZ4

Sony Xperia XZ4
52 మెగా పిక్సల్ కెమెరాతో సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్4 (Sony Xperia XZ4)

కెమెరా సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో జపాన్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం సోనీ ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. త్వరలో తాము అందుబాటులోకి తీసుకురాబోతోన్న ట్రిపుల్ కెమెరా సెటప్ ఫోన్‌లో ఏకంగా 52 మెగా పిక్సల్ కెమెరా లెన్స్‌ను నిక్షిప్తం చేస్తున్నట్లు తెలిపింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2019లో భాగంగా ఈ ఫోన్‌ను లాంచ్ చేసే అవకాశముందని తెలుస్తోంది.

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్4 (Sony Xperia XZ4) అనే పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో ఎక్విప్ చేసిన మూడు కెమెరాల వ్యవస్థ 52 మెగా పిక్సల్ + 16 మెగా పిక్సల్ + 0.3 మెగా పిక్సల్ కాంభినేషన్‌లో ఉంటుందట. 52 మెగా పిక్సల్ కెమెరా లెన్స్‌ ఏర్పాటకు సంబంధించిన ప్రధాన ఉద్దేశాన్ని కంపెనీ వెల్లడించలేదు

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్4 స్పెక్స్ (అన్అఫీషియల్‌)

6.5 ఇంచ్ అమోల్డ్ స్ర్కీన్ విత్ క్వాడ్ – హెచ్‌డి రిసల్యూషన్ (3360 x 1440 పిక్సల్స్), ఆండ్రాయిడ్ పై
9.0 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డి స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని పెంచుకునే అవకాశం, 52 మెగా పిక్సల్ + 16 మెగా పిక్సల్ + 0.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 4400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.