Redmi Note 6 Pro లాంచ్ అయ్యింది, ధర రూ.13,999, ఈ రోజు కొంటే రూ.1000 తగ్గింపు

Redmi Note 6 Pro లాంచ్ అయ్యింది, ధర రూ.13,999

భారీ అంచనాల మధ్య రెడ్‌మి నోట్ 6 ప్రో (Redmi Note 6 Pro) ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మొత్తం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటి వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో లభ్యమవుతుంది. ధర రూ.13,999. రెండవ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో లభ్యమవుతుంది. ధర రూ.15,999.

Image Credit : Flipkart
Image Credit : Flipkart

ఈ స్మార్ట్‌ఫోన్ బ్లు, రెడ్, బ్లాక్ ఇంకా రోజ్ గోల్డ్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన మొదటి ఫ్లాష్‌సేల్, Flipkart ఇంకా Mi.comలలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. సేల్ స్టార్ట్ అయిన కొద్ది సేపటికే  ఫోన్‌లు మొత్తం అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వటం విశేషం. రెడ్‌మి నోట్ 6 ప్రోకు సంబంధించిన రెండవ ఫ్లాష్‌సేల్ త్వరలోనే జరుగుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే ఎంఐ హోమ్ స్టోర్‌లతో పాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌లలోకి తీసుకురాబోతున్నట్లు షావోమి వెల్లడించింది.

Redmi Note 6 Pro
Image Credit : Flipkart

బ్లాక్ ఫ్రైడే సేల్‌ను పురస్కరించుకుని రెడ్‌మి నోట్ 6 ప్రో 4జీబి ర్యామ్ అలానే 6జీబి ర్యామ్ వేరియంట్‌ను రూ.1000 తగ్గింపుతో రూ.12999, రూ.14,999కే ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది. ఇదే సమయంలో HDFC Bank క్రెడిట్ అలానే డెబిట్ కార్డ్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి రూ.500 ఇన్‌స్టెంట్ క్యాష్‌బ్యాక్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. లాంచ్ ఆఫర్ క్రింద ఈ ఫోన్ కొనుగోలు పై రూ.2400 ఇన్‌స్టెంట్ క్యాష్‌బ్యాక్‌తో పాటు 6 టీబీ కాంప్లిమెంటరీ డేటాను జియో అందిస్తోంది.

Redmi Note 6 Pro
Image Credit : Flipkart

Redmi Note 6 Pro స్పెసిఫికేషన్స్.. 6.26 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (2280 x 1080 పిక్సల్స్) విత్ 19:9 యాస్పెక్ట్ రేషియో. ఈ డిస్‌ప్లే 500 nits  బ్రైట్నెస్‌ను ఆఫర్ చేస్తుంది. స్ర్కీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 86 శాతంగా ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత MIUI 10 పై రన్ అవుతంది. ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 1.8గిగాహెట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఈ డివైస్‌లో ఎక్విప్ చేసారు. ఈ ప్రాసెసర్‌కు అనుసంధానించిన అడ్రినో 509 జీపీయూ గ్రాఫిక్ విభాగాన్ని హ్యండిల్ చేస్తుంది.

Redmi Note 6 Pro
Image Credit : Flipkart

కెమెరా విభాగానికి వచ్చేసరికి Redmi Note 6 Pro ప్రో ఏకంగా నాలుగు కెమెరాలతో వస్తోంది. వీటిలో రెండు కెమెరాలు ఫోన్ ముందు, మరో రెండు కెమెరాలు ఫోన్ వెనుకా ఎక్విప్ అయి ఉంటాయి. ముందు భాగంలో ఎక్విప్ చేసిన 20 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ ఫ్రెంట్ కెమెరా సెటప్ ద్వారా పోర్ట్రెయిట్ సెల్ఫీ)లను క్యాప్చుర్ చేసుకోవచ్చని షావోమి చెబుతోంది. ఈ సెన్సార్స్‌తో పెయిర్ చేసిన 4ఇన్1 సూపర్ పిక్సల్ ఇంకా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫేస్‌ అన్‌లాక్ ఫంక్షనాలిటీలు క్వాలటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తాయి. ఫోన్ వెనుక భాగంలో ఎక్విప్ చేసిన 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెన్సార్స్ రెడ్‌మి నోట్ 5 ప్రో తరహాలోనే డ్యుయల్ పిక్సల్ ఆటో ఫోకస్, 1.4 మైక్రాన్ పిక్సల్స్, ఏఐ పోర్ట్రెయిట్ 2.0 వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటాయి.

Redmi note 6 pro
Redmi note 6 pro

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్‌లో శక్తివంతమైన 4,000mAh బ్యాటరీని షావోమి లోడ్ చేసింది. ఈ బ్యాటరీ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. కనెక్టువిటీ విభాగాన్ని పరిశీలించినట్లయితే.. డ్యుయల్ 4జీ వోల్ట్, బ్లుటూత్ 5, జీపీఎస్, ఏ-గ్లోనాస్, మైక్రో-యూఎస్బీ 2.0 పోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ వంటి కనెక్టువిటీ ఫీచర్స్ ఈ డివైస్ లో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.