Realme A1 వచ్చేస్తోంది..!

Realme A1

రియల్‌మి బ్రాండ్ నుంచి త్వరలో లాంచ్ కాబోతోన్న రియల్‌మి ఏ1 (Realme A1) స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి మేజర్ స్పెసిఫికేషన్స్ ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.  ట్రెండింగ్ లీక్స్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం రియల్‌మి ఏ1 స్మార్ట్‌ఫోన్‌ 1.8గిగాహెట్జ్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో రాబోతోంది.

ఇదే సమయంలో ఈ ఫోన్ 2జీబి ఇంకా 3జీబి ర్యామ్ వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో వెర్షన్ పై రన్ అవుతుంది. శక్తివంతమైన 4200 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఈ హ్యాండ్‌సెట్‌లో లోడ్ చేసినట్లు తెలుస్తోంది.

మరో రూమర్ ప్రకారం, రియల్‌మి ఏ1..  డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో ఎక్విప్ అయి ఉంటుంది. 13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ కాంభినేషన్‌లో ఈ సెన్సార్స్ ప్యాక్ అయి ఉంటాయి.  ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసరికి ఫోన్ ముందులో  8 మెగా పిక్సల్ సెన్సార్ ఎక్విప్ అయి ఉంటుంది. వాటర్ డ్రాప్ నాట్చ్ స్ర్కీన్‌తో రాబోతోన్న ఈ ఫోన్ మరికొద్ది రోజుల్లో మార్కెట్లో లాంచ్ కాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.