8జీబి ర్యామ్‌తో Realme 2 Pro, ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్

Realme 2 Pro
8జీబి ర్యామ్‌తో Realme 2 Pro, ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్

ఒప్పో సబ్సిడరీ బ్రాండ్‌ రియల్‌మీ (Realme), సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది. రియల్‌మీ 2 ప్రో (Realme 2 Pro) పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌కు సంబంధించి పలు ఇంటర్నెల్ స్పెక్స్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయ్యాయి. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 సాక్ పై రన్ కాబోతోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ అఫీషియల్‌గా విక్రయించబోతోందట.

Also Read : Amazon Echo లైనప్ నుంచి సరికొత్త స్మార్ట్ స్పీకర్లు, ప్రారంభ మోడల్ ధర రూ.4,499

ప్రముఖ యూట్యూబ్ ఛానల్ టెక్నికల్ గురూజీ(Technical Guruji)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా రియల్‌మీ ఇండియా సీఈఓ మాధవ్ ఫేథ్ పలు ఆసక్తికర వివరాలను రివీల్ చేసారు. ముఖ్యంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న మిడ్-రేంజ్ ఫోన్స్ అలానే త్వరలో లాంచ్ కాబోతోన్న రియల్‌మీ 2 ప్రో డివైస్‌కు మధ్య ఉన్న తేడాలను ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన వివరించారు.

Also Read : వైరల్ అవుతోన్న Airtel రూ.168 ప్లాన్..

రియల్‌మీ 2 మొబైల్‌కు సక్సెసర్ వెర్షన్‌గా మార్కెట్లోకి రాబోతోన్న రియల్‌మీ 2 ప్రోలో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్‌ను ఎక్విప్ చేసినట్లు ఆయన తెలిపారు. శక్తివంతమైన ప్రాసెసర్‌తో పాటు పెద్దదైన వాటర్‌డ్రాప్ స్టైల్ నాట్చ్ డిస్‌ప్లే వ్యవస్థలను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

Also Read : 8జీబి ర్యామ్, 512జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్టుతో Razer Phone 2

గీక్‌బెంచ్ (Geekbench) లిస్టింగ్స్ ప్రకారం రియల్‌మీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 8జీబి ర్యామ్‌తో పాటు ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టంను రియల్‌మీ లోడ్ చేసింది. OPPO RMX1807 అనే కోడ్ నేమ్‌‌ను క్యారీ చేస్తున్న ఈ రియల్‌మీ డివైస్ సింగిల్ కోర్ అలానే మల్టీ-కోర్ టెస్టుల్లో 1452, 5511 స్కోర్‌లను నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ స్కోర్స్ ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన ఒప్పో ఆర్11 స్మార్ట్‌ఫోన్‌తో సమానంగా ఉండటం విశేషం. రియల్‌మీ ఇండియా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ రివీల్ చేసిన వివరాల ప్రకారం తన అప్‌కమ్మింగ్ డివైస్ ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతుంది. సెప్టంబర్ 27న ఈ ఫోన్ లాంచ్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.