మూడు కొత్త ఫోన్‌లతో మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన Meizu, అమెజాన్ ఇండియాలో సేల్ ప్రారంభం

Meizu Smartphones

చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మిజు (Meizu), మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లతో ఇండియన్ మార్కెట్లోకి రిఎంట్రీ ఇచ్చింది. కంపెనీ కొత్తగా లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్‌లు మిజు ఎమ్6టి (Meizu M6T), మిజు సీ9 (Meizu C9), మిజు M16th మోడల్స్‌లో అందుబాటులో ఉంటాయి. వీటిలో ఫ్లాగ్‌షిప్ ప్రీమియమ్ మోడల్ అయిన Meizu M16th ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 20 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా వంటి లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది.

Meizu
Meizu launches Three New Smartphones in india

ఇండియన్ మార్కెట్లో వీటి ధరలను పరిశీలించినట్లయితే మిజు ఎమ్6టి (Meizu M6T) ధర రూ.7,999గా ఉంటుంది. ఈ ఫోన్ 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరజ్ కెపాసిటీతో లభ్యమవుతుంది. మరో మోడల్ మిజు సీ9 (Meizu C9) రూ.5,999 ధర ట్యాగ్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ ఎంట్రీ లెవల్ ఫోన్ 2జీబి ర్యామ్ + 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో లభ్యమవుతుంది. లాంచ్ ఆఫర్ క్రింద ఈ స్మార్ట్‌షోన్‌ను రూ.4,999కే అమెజాన్ విక్రయిస్తోంది. మరో మోడల్ Meizu M16th రూ.39,999 ధర ట్యాగ్‌తో లభ్యమవుతుంది. ఈ ఫోన్ 8జీబి ర్యామ్ + 256జీబి స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే లభ్యమవుతుంది.

ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లను అమెజాన్ ఇండియా (Amazon India) ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. సేల్ ఇప్పటికే ప్రారంభమయ్యింది. లాంచ్ ఆఫర్స్ క్రింద Meizu M16th కొనుగోలు పై రూ.2,200 క్యాష్‌బ్యాక్‌తో పాటు 100 జీబి అదనపు డేటాను రిలయన్స్ జియో ప్రొవైడ్ చేస్తోంది. ఇదే సమయంలో Meizu M6T అలానే Meizu C9 కొనుగోళ్ల పై రూ.2,200 క్యాష్‌బ్యాక్‌తో పాటు 50 జీబి అదనపు డేటా లభిస్తుంది.

Meizu C9 Launched in India
Meizu C9 Launched in India

మిజు ఎమ్6టి (Meizu M6T) స్పెసిఫికేషన్స్.. 5.7 ఇంచ్ హైడెఫినిషన్ ప్లస్ (720×1440 పిక్సల్స్) ఇన్-సెల్ డిస్‌ప్లే విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ Flyme OS, ఆక్టా-కోర్ మీడియాటెక్ MT6750 సాక్, 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్ (నానో) కనెక్టువిటీ.

మిజు సీ9 (Meizu C9) స్పెసిఫికేషన్స్..5.45 ఇంచ్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, స్టాక్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ క్వాడ్-కోర్ Spreadtrum 9832E ప్రాసెసర్, 2జీబి ర్యామ్ + 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, కనెక్టువిటీ ఫీచర్స్ (4G VoLTE, Wi-Fi, Bluetooth v4.1, GPS, GLONASS), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Meizu M16th Launched in India
Meizu M16th Launched in India

Meizu M16th స్పెసిఫికేషన్స్.. 6 ఇంచ్ ఫుల్ హైడెఫనిషన్ ప్లస్ (1080×2160 పిక్సల్స్) సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో అండ్  89.57% స్ర్కీన్ టు బాడీ రేషియో, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ విత్ అడ్రినో 630 జీపీయూ, 8జీబి ర్యామ్, 128జీబి యూఎఫ్ఎస్ 2.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3,010 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఎమ్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, కనెక్టువిటీ ఫీచర్స్ (4G VoLTE, వై-ఫై, బ్లుటూత్ 5.0 విత్ యాప్టెక్స్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్).

మార్కెట్లో రీఎంట్రీలో భాంగా మిజు తన కొత్త స్మార్ట్‌ఫోన్‌లతో పాటు రెండు బ్లుటూత్ ఇయర్ ఫోన్‌లను కూడా మార్కెట్లో అనౌన్స్ చేసింది. Meizu POP, Meizu EP52 Lite పేర్లతో ఈ బ్లుటూత్ ఇయర్‌ఫోన్స్ అందుబాటులో ఉంటాయి. వీటిలో మొదటి మోడల్ ఖరీదు రూ.6,999. రెండవ మోడల్ ఖరీదు రూ.1,999.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.