12జీబి ర్యామ్‌తో lenovo స్మార్ట్‌ఫోన్, జనవరి 1 నుంచి ప్రీ-బుకింగ్స్

Lenovo Z5 Pro GT
12జీబి ర్యామ్‌తో lenovo స్మార్ట్‌ఫోన్, జనవరి 1 నుంచి ప్రీ-బుకింగ్స్

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో సరికొత్త సంచలనానికి తెరతీస్తూ ఏకంగా 12జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ను లెనోవో (Lenovo) అనౌన్స్ చేసింది. ఈ బ్రాండ్ నుంచి కొద్ది రోజుల క్రితం మార్కెట్లో అనౌన్స్ అయిన స్లైడింగ్ కెమెరా ఫోన్ జెడ్5 ప్రో (Z5 Pro)కు సంబంధించి అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను లెనోవో అనౌన్స్ చేసింది.

లెనోవో జెడ్ 5 ప్రో జీటీ (Lenovo Z5 Pro GT) పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ స్పెషల్ వేరియంట్‌ 12జీబి ర్యామ్‌తో పాటు క్వాల్కమ్ లేటెస్ట్ ప్రాసెసర్ అయిన స్నాప్‌డ్రాగన్ 855 ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌తో ఎక్విప్ అయి ఉంటుంది. ప్రత్యేకమైన కార్బన్ ఫైబర్ ఎక్స్‌టీరియర్‌తో డిజైన్ కాబడిన ఈ స్మార్ట్‌ఫోన్ ఏకంగా 512జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. 

12జీబి ర్యామ్‌తో lenovo స్మార్ట్‌ఫోన్, జనవరి 1 నుంచి ప్రీ-బుకింగ్స్
Image Source : Techpp

లెనోవో జెడ్ 5 ప్రో జీటీ (Lenovo Z5 Pro GT) ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్స్..

6.3 ఇంచ్ (1080 × 2340) ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ స్ర్కీన్ విత్ 19.5:9 యాస్పెక్ట్ రేషియో విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి, 12జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి, 512జీబి), 16 మెగా పిక్సల్ + 24 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేషియల్ రికగ్నిషన్ కోసం సెకండరీ ఐఆర్ కెమెరా, 3350 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, కనెక్టువిటీ ఫీచర్స్ ( యూఎస్బీ టైప్-సీ, డ్యుయల్ 4జీ VoLTE, వై-ఫై 802.11 ac, బ్లుటూత్ 5, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్.  

ధర ఇంకా అందుబాటు..

లెనోవో జెడ్ 5 ప్రో జీటీ (Lenovo Z5 Pro GT) చైనా మార్కెట్లో మాత్రమే లభ్యమవుతుంది. 2019, జనవరి  24 నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది. ప్రీ-ఆర్డర్స్ 2019, జనవరి 1 నుంచి ప్రారంభమవుతాయి. 6జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్ వేరియంట్ ధర 2,698 Yuanలు (ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.27,639). 8జీబి ర్యామ్ +256జీబి స్టోరేజ్ వేరియంట్ ధర 3,998 Yuanలు (ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.40,957). 12జీబి ర్యామ్ + 512జీబి స్టోరేజ్ వేరియంట్ ధర 4398 Yuanలు (ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.45,061).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.