ఇప్పుడు Google Pay యాప్ నుంచే ట్రెయిన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు

Google Pay
ఇప్పుడు గూగుల్ పే యాప్ నుంచే ట్రెయిన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు

చిన్నారుల్లో భాషాపరమైన నైపుణ్యాలను  మెరుగుపరిచేందుకు కొద్ది రోజుల క్రితమే బోలో యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన గూగుల్ తాజాగా మరో సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. తన డిజిటల్ పేమెంట్స్ సర్వీస్ అయిన గూగుల్ పే (Google Pay)లో  కొత్త ఫీచర్‌ను యాడ్ చేసింది.  ఈ ఫీచర్ సహాయంతో గూగుల్ పే యూజర్లు నేరుగా తమ యాప్ నుంచే ఐఆర్‌సీటీసీ టికెట్లను బుక్ చేసుకునే వీలుంటుంది.

ఈ రెండు సంస్థల మధ్య తాజాగా కుదిరిన ఒప్పందంలో భాగంగా  ఐఆర్‌సీటీసీ అకౌంట్‌ను ఇక పై  గూగుల్ పే యాప్ లోనూ ఓపెన్  చేసుకునే వీలుంటుంది.  ట్రెయిన్ సెర్చ్, టికెట్ బుకింగ్, సీట్ల అందుబాటు, ప్రయాణ సమయాలు వంటి లావాదేవీలను గూగుల్ పే నుంచే నిర్వహించుకునే వీలుంటుంది.

ఐఆర్‌సీటీసీ టికెట్లను గూగుల్ పేలో బుక్ చేసుకున్నందుకు గాను  ఎటువంటి అదనపు ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం ఉండదని గూగుల్ చెబుతోంది.  ఈ సదుపాయాన్ని  ఆండ్రాయిడ్ యూజర్లతో పాటు ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులో ఉంచినట్లు  గూగుల్ పే ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ అంబారిష్ కెన్గీ తెలిపారు.

గూగుల్ పేలో ట్రెయిన్ టికెట్లను ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే?

  • ముందుగా గూగుల్ పే యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.  యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత లోపలికి లాగిన్ అయి వ్యక్తిగత అకౌంట్‌ను సెటప్ చేసుకోవాలి.
  • యాప్ లాంచ్ అయిన తరువాత మెయిన్ స్ర్కీన్ పై కనిపించే బిజినెస్ సెక్షన్ విభాగంలో  ట్రెయిన్స్ పేరుతో ఆప్షన్ కనబుడుతుంది. 
  • ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మరో స్ర్కీన్ ఓపెన్ అవుతుంది.  ఇప్పుడు స్ర్కీన్ పై కనిపించే  బుక్ ట్రెయిన్ టికెట్స్  ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
  • తరువాత ఓపెన్ అయ్యే పేజీలో  ప్రయాణ వివరాలను ఎంటర్ చేసినట్లయితే అందుబాటులో ఉన్న రైళ్లకు సంబంధించిన వివరాలు స్ర్కీన్ పై ప్రదర్శించబడతాయి.
  • వాటిలో మీకు కావల్సిన ట్రెయిన్‌ను సెలక్ట్ చేసుకుని ఓకే బటన్ పై క్లిక్ చేసిన వెంటనే  ఐఆర్‌సీటీసీ అకౌంట్ వివరాలను వెరిఫై చేసుకోమని అడుగుతుంది.
  • ఒకవేళ మీకు అకౌంట్ లేకపోయినట్లయితే అప్పటికప్పుడు కొత్త అకౌంట్‌ను ఓపెన్ చేసుకునే వీలుంటుంది.
  • ఈ ప్రాసీజర్ పూర్తి అయిన వెంటనే ప్యాసెంజర్ వివరాలను ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై టాప్ చేసినట్లయితే పేమెంట్ మోడ్ విభాగంలోకి వెళతారు. అక్కడ చెల్లింపు మోడ్‌ను సెలక్ట్ చేసుకుని యూపీఐ కోడ్‌ను ఎంటర్ చేసినట్లయితే  ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి డైరెక్ట్ కాబడుతారు.
  • అక్కడ ఐఆర్‌సీటీసీ పాస్‌వర్డ్‌తో పాటు క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసినట్లయితే టికెట్లు విజయవంతంగా బుక్ కాబడతాయి. బుక్ అయిన టెకట్లను డౌన్‌లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.