క్రేజీ కలర్ వేరియంట్‌తో Honor Play

Honor Play
క్రేజీ కలర్ వేరియంట్‌తో Honor Play

Huawei సబ్సిడరీ బ్రాండ్ హానర్, తన Honor Play స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి సరికొత్త కలర్ వేరియంట్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. తాజా యాడ్‌ ఆన్‌తో Ultraviolet కలర్ ఆప్షన్‌లోనూ హానర్ ప్లే డివైస్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.19,999. అక్టోబర్ 3 అమెజాన్ ఇండియాలో సేల్ స్టార్ట్ అవుతుంది.

Also Read : Samsung Galaxy J6 పై ధర తగ్గింపు, ఇప్పుడు రూ.12,490కే మార్కెట్లో లభ్యం

హానర్ ప్లే అల్ట్రా‌వైలెట్ వేరియంట్ స్పెసిఫికేషన్స్.. 6.3 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, హైసిలికాన్ కైరిన్ 970 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఇక కనెక్టువిటీ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి 4జీ వోల్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్స్ ఈ డివైస్‌లో ఉన్నాయి.

Also Read : Facebook హ్యాక్ అయ్యింది, ప్రమాదంలో 5 కోట్ల అకౌంట్లు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.