Honor బ్రాండ్ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది..

honor 7S
Honor బ్రాండ్ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది..

ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ‘హానర్’ (Honor) ఒకటి. ఈ బ్రాండ్ నుంచి లాంచ్ అయిన ‘హానర్ 7ఎక్స్’ (Honor 7x) ఫోన్ ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికి తెలుసు. తాజాగా ఈ బ్రాండ్ నుంచి మరో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది.

హానర్ 7ఎస్ (Honor 7S) పేరుతో ఈ బడ్జెట్ ఫోన్ అందుబాటులో ఉంటుంది. IANS రిపోర్ట్ ప్రకారం సెప్టంబర్ మొదటి వారంలో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్  ఈ డివైస్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు సెల్ఫీ టోనింగ్ ఫ్లాష్‌తో కూడిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఈ స్మార్ట్‌ఫోన్‌కు ప్రధానమైన హైలైట్‌గా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read : Diesel బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్ Full Guard 2.5

హానర్ 7ఎస్ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే పాకిస్తాన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ధర PKR 14,499 (ఇండియన్ కరెన్సీలో రూ.8,333). బ్లాక్, బ్లు ఇంకా గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఫోన్ ఇతర స్పెక్స్ పరిశీలించినట్లయితే.. 5.45 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1440 x 720 పిక్సల్స్), 295 పీపీఐ, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, ఎంట్రీలెవల్ మీడియాటెక్ MT6739 1.5గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 256జీబి వరకు పెంచుకునే అవకాశం.

Also Read : గూగుల్ తేజ్ ఇక గూగుల్ పే

ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్ అందుబాటులో లేనప్పటికి ఫేస్ అన్‌లాక్ ఫీచర్ సపోర్ట్‌ను ఈ డివైస్‌లో అందుబాటులో ఉంచారు. కెమెరా డిపార్ట్‌మెంట్ విషయానికి వచ్చేసరికి 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3020ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4G VoLTE, బ్లుటూత్ 4.2, వై-ఫై 802.11 b/g/n, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, ఫోన్ బరువు 142 గ్రాములు, చుట్టుకొలత 146.5 x 70.9 x 8.3 మిల్లీ మీటర్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.