బెస్ట్ బడ్జెట్ ఫోన్స్ 2018

best budget phones 2018
బెస్ట్ బడ్జెట్ ఫోన్స్ 2018

ఈ ఏడాదికి గాను అనేక మిడ్-రేండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. వీటిలో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు పనితీరు పరంగా యావరేజ్ రివ్యూలను సొంతం చేసుకోగా, మరికొన్ని మాత్రం పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకున్నాయి.

Xiaomi Poco F1
Offers on Xiaomi Poco F1

షావోమి పోకో ఎఫ్1 (Xiaomi Poco F1)

2018కి గాను ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన బెస్ట్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో షావోమి పోకో ఎఫ్1 (Xiaomi Poco F1) ఒకటి. స్నాప్‌డ్రాగన్ 845 (Snapdragon 845) మొబైల్ చిప్‌సెట్‌తో లాంచ్ అయిన చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా షావోమి పోకో ఎఫ్1 గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్‌లలో లభ్యమవుతోంది.

అందులో మొదటి వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ, రెండవ వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ, మూడవ వేరియంట్ వచ్చేసరికి 8జీబి ర్యామ్ + 256జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ లభ్యమవుతున్నాయి. వీటి ధరలు మోడల్‌ను బట్టి రూ.20,999, రూ.23,999, రూ.28,999 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 

Realme 2 Pro
8జీబి ర్యామ్‌తో Realme 2 Pro, ప్రారంభ మోడల్ ధర రూ.13,990

రియల్‌మి 2 ప్రో (Realme 2 Pro)

ఈ జాబితాలో రెండవది రియల్‌మి 2 ప్రో. మోస్ట్ అడ్వాన్సుడ్ ఫీచర్లతో లాంచ్ అయిన ఈ మిడ్-రేంజ్ డివైస్  మొత్తం మూడు వేరియంట్‌లలో లభ్యమవుతోంది. అందులో మొదటి వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ, రెండవ వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ, మూడవ వేరియంట్ వచ్చేసరికి 8జీబి ర్యామ్ + 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ లభ్యమవుతున్నాయి. వీటి ధరలు మోడల్‌ను బట్టి రూ.13,990, రూ.15,990, రూ.17,990 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 

Asus Zenfone Max Pro M1,
అదరగొట్టిన Asus Zenfone Max Pro M1, 6 నెలల్లో 10 లక్షల ఫోన్‌ల అమ్మకాలు..

ఆసూస్ జెన్‌ఫోన్ మాక్స్ ప్రో ఎమ్1 (Asus Zenfone Max Pro M1)

ఈ జాబితాలో మూడవది ఆసూస్ జెన్‌ఫోన్ మాక్స్ ప్రో ఎమ్1. స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్‌కు శక్తివంతమైన 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ మిడ్-రేంజ్ డివైస్ కూడా మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటి వేరియంట్ వచ్చేసరికి 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ, రెండవ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ, మూడవ వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ లభ్యమవుతున్నాయి. వీటి ధరలు మోడల్‌ను బట్టి రూ.10,999, రూ.12,999, రూ.14,999 వద్ద ట్రేడ్ అవుతోంది. 

Xiaomi Redmi Note 5 Pro

షావోమి రెడ్‌మి నోట్ 5 ప్రో (Xiaomi Redmi Note 5 Pro)

ఈ జాబితాలో నాల్గవది షావోమి రెడ్‌మి నోట్ 5 ప్రో. డ్యుయల్ కెమెరా మాడ్యుల్‌తో లాంచ్ కాబడిన ఈ మొట్టమొదటి మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ డివైస్ మొత్తం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అందుబాటులో మొదటి వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులో ఉంటుంది. ఖరీదు రూ.13,999. రెండవ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులో ఉంటుంది. ఖరీదు రూ.16,999. 

Honor Play

హానర్ ప్లే (Honor Play)

ఈ జాబితాలో ఐదవది హానర్ ప్లే (Honor Play). ఈ మిడ్-రేంజ్ ఫోన్‌లో కెమెరా పనితీరు అత్యుత్తమంగా ఉంటుంది. ఇదే సమయంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఫోన్ వినియోాన్ని మరింత సులభతరం చేస్తుంది. ఈ డివైస్ మొత్తం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులో ఉంటుంది. ఖరీదు రూ.19,999. రెండవ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులో ఉంటుంది. ఖరీదు రూ.23,999. 

Nokia 6.1 Plus

నోకియా 6.1 ప్లస్ (Nokia 6.1 Plus)

ఈ జాబితాలో ఆరవది నోకియా 6.1 ప్లస్ (Nokia 6.1 Plus). నోకియా నుంచి లాంచ్ అయిన మొట్టమొదటి మిడ్-రేజ్ నాట్చ్ ఫోన్ కూడా ఇదే కావటం విశేషం. ఈ ఫోన్‌ను 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులో ఉంటుంది. ఖరీదు రూ.15,999. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.