మీరు ఇన్‌స్టాగ్రామ్ వాడుతుంటారా..?

మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కోసం బెస్ట్ టిప్స్....

ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌ను అన్ని రకాల యూజర్లు ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలో మీ పర్సనల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లను మరింత ఎఫెక్టివ్‌గా వాడుకునేందుకు పలు టాప్ టిప్స్ అండ్ ట్రిక్స్‌..

ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు చేసే పోస్ట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే hashtag యాడ్ చేయటం తప్పనిసరి. హ్యాష్‌ట్యాగ్ అనేది క్లికబుల్ వర్డ్. ఫోటో వివరణ క్రింద ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి, ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు చేసే ప్రతి పోస్టింగ్ క్రింద ఇలాంటి కామన్ హ్యాష్‌ట్యాగ్స్ ఉండేలా చూసుకోండి. #Love, #Instadaily, #Instagood

ఇన్‌స్టాగ్రామ్‌లో మీ బ్లాగ్ లేదా షాపింగ్ పోర్టల్‌కు సంబంధించిన కంటెంట్‌ను ప్రమోట్ చేస్తున్నట్లయితే మీరు యాడ్ చేసే వీడియో లేదా ఫోటో టాపిక్‌కు చాలా దగ్గరగా ఉండాలి. ఆఫ్ టాపిక్ ఇమేజెస్‌ను పోస్ట్ చేయటం ద్వారా టార్గెటెడ్ వ్యూవర్స్‌ను మీరు చేరుకోలేరు. ఇన్‌స్టాగ్రామ్‌ అనేది రియల్ టైమ్ బేసిస్‌లో పనిచేస్తుంది. కాబట్టి మీ పోస్టింగ్స్ రెగ్యులర్‌‌గా ఉండాలి.

ఇన్‌స్టాగ్రామ్‌లో మీ బ్లాగ్ లేదా షాపింగ్ పోర్టల్‌కు సంబంధించిన కంటెంట్‌ను ప్రమోట్ చేస్తున్నట్లయితే మీరు టార్గెటెడ్ అకౌంట్‌లను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. మీ పోస్టింగ్స్‌కు #TeamFollowback #FollowBack వంటి డిస్ర్కిప్షన్స్ ఇవ్వటం ద్వారా ఎక్కువమంది ఫాలోవర్స్ లబించే అవకాశం ఉంటుంది.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్‌లలో లైక్ ఫీచర్ బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుని ఇతరుల పోస్టింగ్స్‌ను మీరు లైక్ చేయటం ద్వారా మీ పోస్టింగ్స్‌కు కూడా లైక్స్ లభించే అవకాశం ఉంటుంది.

మీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను కేవలం ఫోటో ఎడిటింగ్‌కు మాత్రమే ఉపయోగించుకోవాలనుకుంటే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచి ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్లతో ఫోటోలను ఎడిట్ చేసుకోండి, నెట్‌వర్క్ ఎర్రర్ చూపించటంతో అవి ఫోన్ గ్యాలరీలోనే సేవ్ అవుతాయి.

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ ఇమ్యులేటర్ యాప్ సహాయంతో వ్యక్తిగత, ప్రొఫెషనల్ అవసరాలకు మల్టీపుల్ అకౌంట్‌లను రన్ చేసుకోవచ్చు.

పలువురి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లకు సంబంధించిన బయోగ్రఫీలు కూల్‌లైన్ బ్రేకప్స్‌తో  ఆకట్టుకునే విదంగా ఉంటాయి. ఇలా మీకు కూడా కావాలంటే సింపుల్. కంటెంట్‌ను కావల్సిన విధంగా టెక్స్ట్ ఎడిటర్ లేదా ఎంఎస్‌వర్డ్ సహాయంతో ఎడిట్ చేసుకుని అదే కంటెంట్‌ను మీ ఇన్‌స్టాగ్రామ్ బయోగ్రఫీలో పోస్ట్ చేయండి సరిపోతుంది.

మీరు పోస్ట్ చేసే ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు డీఫాల్టుగాగా జియో లొకేషన్ ట్యాగ్స్‌తో పోస్ట్ అవుతుంటాయి. తద్వారా వేరుకురు మీ లోకేషన్‌ను సులువుగా యాక్సెస్ చేసుకునే వీలుంటుంది. సెట్టింగ్స్‌ను మార్చుకోవటం ద్వారా జియో ట్యాగ్‌లను రిమూవ్ చేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.