ఇక నుంచి LIC ప్రీమియమ్ చెల్లింపులను Paytm ద్వారా చేపట్టవచ్చు

Paytm Lic insurance premium payments option
Paytm adds Lic insurance premium payments option

ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్స్ సర్వీస్ పేటీఎమ్ (Paytm), ఎల్ఐసీ ప్రీమియమ్ చెల్లింపులను మరింత సులభతరం చేసే క్రమంలో ప్రభుత్వం రంగ భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)తో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఎల్ఐసీ ప్రీమియమ్ చెల్లింపులను ఇక నుంచి పేటీఎమ్ ద్వారా చేపట్టే వీలుంటుంది. పేటీఎమ్ (Paytm) బాటలోనే మొబిక్‌విక్ (Mobikwik) కూడా డిజిటల్ ఇన్సూరెన్స్ మార్కెట్లోకి అడుగుపెట్టింది.

Lic premiun payments on paytm
Lic premiun payments on paytm

ఎల్ఐసీతో కుదుర్చుకున్న ఒప్పందంతో పేటీఎమ్ పరిధిలోని ఇన్సూరెన్స్ కంపెనీల సంఖ్య 30కి పైగా పెరిగింది. ఈ ఆన్‌లైన్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎల్ఐసీ ఇండియా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, రిలయన్స్ లైఫ్, మాక్స్ లైఫ్, హెచ్‌డిఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బి‌ఐ లైఫ్, ఆదిత్యా బిర్లా సన్ లైఫ్, హెచ్‌డిఎఫ్‌సీ ఈర్గో జనరల్, కెనరా, హెచ్‌ఎస్‌బీసీ, ఓబీసీ, ఏగోన్ లైఫ్ తదితర కంపెనీలకు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియమ్‌లను యూజర్లు చెల్లించవచ్చు.

Paytm Now accepting LIC Premiums
Paytm Now accepting LIC Premiums

పేటీఎమ్ ద్వారా ఎల్ఐసీ ప్రీమియమ్‌లను చెల్లించే క్రమంలో నెట్ బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్స్, యూపీఐ లేదా పేటీఎమ్ వాలెట్‌ను ఉపయోగించుకుని చెల్లింపులు చేపట్టవచ్చు. పేమెంట్ చేసే ముందు ఇన్సూరర్‌గా ఎల్ఐసీ ఇండియాను సెలక్ట్ చేసుకుని ఆ తరువాత పాలసీ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. డిటెయిల్స్ ఎంటర్ చేసిన తరువాత చెల్లించవల్సిన ప్రీమియమ్ అమౌంట్, డ్యు డేట్ ఇంకా ఇన్‌స్టాల్‌మెంట్స్‌కు సంబంధించిన వివరాలు స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతాయి. పేమెంట్స్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్న వెంటనే డీల్‌కు సంబంధించిన ఇన్సూరెన్స్ ఆఫర్స్ అలానే ప్రమోషనల్ కోడ్స్ కనిపిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.