మోటరోలా స్మార్ట్‌ఫోన్‌ల పై క్రిస్మస్ డిస్కౌంట్లు

మోటరోలా స్మార్ట్‌ఫోన్‌ల పై క్రిస్మస్ డిస్కౌంట్లు..

క్రిస్మస్, న్యూఇయర్  పండుగలను పురస్కరించకుని లెనోవో నేతృత్వంలోని మోటరోలా తన మోటో సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్  డిస్కౌంట్లను అనౌన్స్ చేసింది. ఈ లిమిటెడ్ పిరియడ్ షార్ట్ డిస్కౌంట్ సేల్ లో భాగంగా మోటో జీ5,  మోటో ఎమ్, మోటో జెడ్2 ప్లే,  మోటో ఇ4, మోటో సీ స్మార్ట్ ఫోన్ ల పై స్పెషల్ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ తగ్గింపు ధరలను లీడింగ్  ఆఫ్ లైన్ స్టోర్ లతో పాటు మోటో హబ్ అవుట్ లెట్ లలో పొందవచ్చని మోటరోలా తెలిపింది.

డిస్కౌంట్ల వివరాలను పరిశీలించినట్లయితే… 

రూ.9,999 ధర ట్యాగ్‌తో ట్రేడ్ అవుతోన్న మోటో జీ5 మోడల్‌ను వెయ్యి త్గగింపుతో  రూ.8,999కే సొంతం చేసుకునే అవకాశం. రూ.27,999 ధర ట్యాగ్ తో ట్రేడ్ అవుతోన్న మోటో జెడ్2  ప్లే మోడల్‌ను  మూడు వేల తగ్గింపుతో రూ.24,999కే సొంతం చేసుకునే అవకాశం. రూ.13,999 ధర ట్యాగ్‌తో డ్రేట్ అవుతోన్న మోటో ఎమ్ (3జీ మోడల్)ను రెండు వేల తగ్గింపుతో రూ.11,999కే సొంతం చేసుకోవచ్చు. రూ.15,999 ధర ట్యాగ్‌తో ట్రేడ్ అవుతోన్న మోటో ఎమ్ (4జీ మోడల్)ను రెండు వేల తగ్గింపుతో రూ.13,999కే సొంతం చేసుకోవచ్చు.

రూ.8,499 ధర ట్యాగ్‌తో ట్రేడ్ అవుతోన్న మోటో ఇ4 మోడల్‌ను ఐదు వందలు తగ్గింపుతో రూ.7,999కే సొంతం చేసుకోవచ్చు. రూ.5,999 ధర తగ్గింపుతో ట్రేడ్ అవుతోన్న మోటో సీ మోడల్‌ను రూ.500 తగ్గింపుతో రూ.5,499కే సొంతం చేసుకోవచ్చు. రూ.13,999 ధర ట్యాగ్ తో ట్రేడ్ అవుతోన్న మోటో జీ5ఎస్ రూ.1000 తగ్గింపుతో రూ.12,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ లిమిటెడ్ పరియడ్ ఆఫర్  డిసెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.