ఇక WhatsApp వాయిస్ మెసేజెస్ వరసగా ప్లే అయిపోతాయ్!

ఇక WhatsApp వాయిస్ మెసేజెస్ వరసగా ప్లే అయిపోతాయ్!

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ (WhatsApp), ఆండ్రాయిడ్ యూజర్లను ఉద్దేశించి కన్సిక్యూటివ్ వాయిస్ మెసేజెస్ (consecutive voice Messages) పేరుతో ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. వాట్సాప్ అప్‌కమ్మింగ్ ఫీచర్స్ గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తూ నమ్మకమైన లీకస్టర్‌గా గుర్తింపుతెచ్చుకున్న WABetaInfo, ఈ కొత్త ఫీచర్ గురించిన వివరాలను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రివీల్ చేసింది. ఈ సమాచారం ప్రకారం వాట్సాప్ తన కన్సిక్యూటివ్ వాయిస్ మెసేజెస్ ఫీచర్‌ను వాట్సాప్ బేటా వెర్షన్ అయిన 2.18.362లో పొందుపరిచింది.

Whatsapp New Feature
Whatsapp New Feature on the way

ఈ ఫీచర్ తన పేరుకు తగ్గట్టుగానే కన్సిక్యూటివ్ వాయిస్ మెసేజెస్‌ను కంటిన్యూస్‌గా ప్లే చేసి వినిపిస్తుందట. వాట్సాప్ రెండు, మూడు వాయిస్ మెసేజ్‌లను డిటెక్ట్ చేసిన వెంటనే ఈ ఫీచర్ వర్క్ చేయటం ప్రారంభిస్తుందని WABetaInfo తెలిపింది.  ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుని వాట్సాప్, రిసీవర్‌కు వచ్చిన వాయిస్ మెసేజ్‌లను ఆటోమెటిక్‌గా ఓ సీక్వెన్సులో ప్లే చేయటం జరుగుతుందని వాట్సాప్ బేటా ఇన్ఫో తెలిపింది.

Whatsapp Android
Whatsapp Android

ఈ ఫీచర్ వర్క్ అవ్వాలంటే రిసిప్టెంట్ కనీసం ఒక వాయిస్ నోట్‌నైనా ప్లే చేయవల్సి ఉంటుందట. ఒక్కో వాయిస్ నోట్ ఎండ్ అయ్యే  సమాయానికి వాట్సాప్ ఓ షార్ట్ ఆడియో టోన్‌ను ప్లే చేస్తుందట. ఈ ఇండికేటర్ టోన్‌ను తరువాత ప్లే అవ్వటానికి సిద్థంగా ఉన్న వాయిస్ నోట్‌కు సంబంధించినదిగా యూజర్ గుర్తించాల్సి ఉంటుందట. ఆండ్రాయిడ్ యూజర్లను ఉద్దేశించి ఓ ప్రత్యేకమైన సెర్చ్ ఆప్షన్‌ను కూడా వాట్సాప్ అభివృద్థి చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా స్టిక్కర్స్ ను సెర్చ్ చేసుకునేందుకు ఈ ఆప్షన్ మరింతగా ఉపయోగపడుతుందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.