మార్కెట్లోకి Philips స్మార్ట్ ఎల్ఈడి టీవీలు, ప్రారంభ వేరియంట్ ధర రూ.9,999

TPV Vision Launches new of Philips Smart LED TVs in India

ఫిలిప్స్ టెలివిజన్ అండ్ ఆడియోకు భారత్‌లో అఫీషియల్ బ్రాండ్ లైసెన్స్ పార్టనర్‌గా వ్యవహరిస్తోన్న టీపీవీ విజన్ టెక్నాలజీ (TPV Vision Technology), కొత్త రేంజ్‌తో కూడిన Philips స్మార్ట్ ఎల్ఈడి టీవీలను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ టీవీ రేంజ్ 22 అంగుళాల నించ 65 అంగుళాల మధ్య వివిధ స్ర్కీన్  వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ప్రారంభ వేరియంట్ ధర రూ.9,990. టాప్-ఎండ్ మోడల్ ధర రూ.1,49,990.

TPV Vision Launches new of Philips Smart LED TVs in India
TPV Vision Launches new of Philips Smart LED TVs in India

వీటిలో టాప్ ఎండ్ మోడ్ అయిన 65-ఇంచ్ ఫిలిప్స్ 65PUT6703S/94, పెద్దదైన స్ర్కీన్‌తో 3-సైడెడ్ ఆంబిలైట్ మోడ్ (Ambilight mode)తో ఎక్విప్ అయి ఉంటుంది. ఈ మోడ్ మూవీస్ ఇంకా గేమ్స్‌ను మరింత ఆకర్షణీయమైన అనుభూతులతో ఆఫర్ చేస్తుంది. ఆంబిలైట్ మ్యూజిక్ మోడ్ (Ambilight music mode)ను ఆన్ చేసుకోవటం ద్వారా ఆంబిలైట్ అవుట్ పుట్ మ్యూజిక్‌తో సింక్ అయి లివింగ్ రూమ్‌ను కాస్తా వర్చువల్ సౌండ్ అండ్ లైడ్ షోలోగా మార్చేస్తుందట. మరో ఫీచర్ అయిన ఇన్‌డైరెక్ట్ లైట్ మోడ్‌ (indirect light mode) టీవిని కాస్తా అత్యాధునిక సోఫిస్టికేటెడ్ మూడ్-సెట్టింగ్ ల్యాంప్‌గా మార్చేస్తుందట.

TPV Vision Launches new of Philips Smart LED TVs in India
TPV Vision Launches new of Philips Smart LED TVs in India

ఈ స్మార్ట్ ఎల్ఈడి టీవీల్లో లోడ్ చేసిన పిక్సల్ ప్రీసైజ్ హెచ్‌డి ఇంజిన్ (Pixel Precise HD engine), పిక్షర్ క్వాలిటీని ఆప్టిమైజ్ చేయటంతో పాటు ఇమేజెస్‌ను అందమైన కాంట్రాస్ట్‌తో మరింత క్రిస్ప్‌గా డెలివరీ చేయగలుగుతుందట. ఈ టీవీల్లో నిక్షిప్తం చేసిన హెచ్‌డిఆర్ (హై డైనమిక్ రేంజ్) ప్లస్ టెక్నాలజీ కంటెంట్‌కు మరింత రిచ్‌నెస్ అలానే లైవ్లీనెస్‌ను అద్ది సరికొత్త అనుభూతులను చేరువ చేస్తుందట.

TPV Vision Launches new of Philips Smart LED TVs in India

TPV Vision Launches new of Philips Smart LED TVs in Indiaఅదనంగా ఈ టీవీల్లో ఇంక్లూడ్ చేసిన స్పెషల్ మైక్రో డిమ్మింగ్ (Micro Dimming)  సాఫ్ట్‌వేర్,  పిక్షర్‌ను 65,000 జోన్ లలో విశ్లేషించి చూసి అవసరమైన విధంగా అడ్జస్ట్ చేయగలుగుతుందట. ఇన్ బిల్ట్ గా లోడ్ చేసిన డీటీఎస్ హెచ్‌డి (sound processing)ను ఎప్పటికప్పుడు ఆప్టిమైజ్ చేస్తూ బెటర్ సౌండ్ అవుట్‌పుట్‌ను ఇవ్వగలగుతుందట.

TPV Vision Launches new of Philips Smart LED TVs in India
TPV Vision Launches new of Philips Smart LED TVs in India

ఇక ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి ఈ టీవీలు ప్రత్యేకమైన SAPHI OS పై రన్ అవుతాయి. ఈ ఆపరేటింగ్ సిస్టం ఆఫర్ చేసే సులువైన నేవిగేషన్ ప్రాసెస్ ద్వారా కంటెంట్ ను మరంత సులువుగా యాక్సిస్ చేసుకునే వీలుంటుందట. ఈ కొత్త టీవీలు అన్ని ఆఫ్‌లైన్ అలానే ఆన్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.