Redmi 7 స్పెసిఫికేషన్స్ ఇవే..

Redmi 6A

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి (Xiaomi), ఇటీవల తన రెడ్‌మి నోట్ సిరీస్ నుంచి  నోట్ 7, నోట్ 7 ప్రో పేరిట రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ లకు సంబంధించిన అమ్మకాలు మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోన్నాయి.  ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర న్యూస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

షావోమి తదుపరి స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన  రెడ్‌మి 7, TENAA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో లిస్ట్ అయ్యింది.  దీంతో ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్స్  బహిర్గతమయ్యాయి.  ఈ సైట్ లిస్టింగ్స్ ప్రకారం Redmi 7  , M1810F6LE  అనే మోడల్ నెంబర్‌ని కలిగి ఉంది.

ఇక స్పెక్స్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్ 6.26 ఇంచ్ హెచ్‌డి+ డిస్‌ప్లే (1520 x 720 పిక్సల్స్)తో రాబోతోంది, 1.8గిగాహెట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో లోడ్ అయి ఈ ఫోన్ 2జీబి, 3జీబి ఇంకా 4జీబి ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. స్టోరేజ్ విషయానికి వచేచసరికి 16జీబి, 32జీబి, 64జీబి ఆప్షన్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది. స్టోరేజ్ ను పెంచుకునేందుకుగాను మైక్రోఎస్డీ స్లాట్ సదుపాయం కూడా ఉంటుంది.

ఇక కెమెరా విషయానికి వచ్చేసరికి Redmi 7  డ్యుయల్ రేర్ కెమరా సెటప్ తో రాబోతోంది.  అందులో ఒకటి సెన్సార్ 12 మెగా పిక్సల్, రెండవ కెమెరాకు సంబంధించిన వివరాలను సదురు సైట్ రివీల్ చేయలేదు.  ఫోన్ ముందు భాగంలో 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ఎక్విప్ అయి ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి Android 9 Pie ఆపరేటింగ్ సిస్టం పై డివైస్ రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 3,900mAh బ్యాటరీని ఈ ఫోన్ లో లోడ్ చేసినట్లు తెలుస్తోంది.  ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.