Realme U1 vs Redmi Note 6 Pro, వీటిలో బెస్ట్ బడ్జెట్ ఫోన్ ఏది?

Realme U1 vs Redmi Note 6 Pro,
Realme U1 vs Redmi Note 6 Pro, వీటిలో బెస్ట్ బడ్జెట్ ఫోన్ ఏది?

ఒప్పో సబ్సిడరి బ్రాండ్ రియల్‌మి (Realme), కొద్ది రోజుల క్రితమే తన Realme U1 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. మీడియాటెక్ హీలియో పీ70 చిప్‌సెట్‌తో లోడై వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో వాటర్ డ్రాప్ నాట్జ్ డిస్‌ప్లే, 25 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా వంటి క్రేజీ ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ మొత్తం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

మొదటి వేరియంట్ వచ్చేసరికి 3జీబి ర్యామ్ + 32 జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ, రెండవ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో లభ్యమవుతాయి. మొదటి వేరియంట్ ఖరీదు 11,999 రూపాయిలు, రెండవ వేరియంట్ ఖరీదు 14,999 రూపాయిలు. డిసెంబర్ 5 నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది. అమెజాన్ ఇండియాలో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.  g

భారీ అంచనాల మధ్య మొదటి సేల్ జరుపుకోబోతోన్న రియల్‌మి యూ1 (Realme U1) స్మార్ట్‌ఫోన్‌కు ఇంచుమించుగా ఇదే బడ్జెట్‌లో లభ్యమవుతోన్న షావోమి రెడ్‌మి నోట్ 6 ప్రో (Xiaomi Redmi Note 6 Pro) నుంచి తీవ్రమైన పోటీ ఎదురు కానుంది. మిడ్ రేంజ్ క్వాల్కమ్ చిప్‌సెట్, షార్ప్ డిస్‌ప్లే ఇంకా డీసెంట్ కెమెరా స్పెక్స్‌ను కలిగి ఉన్న నోట్ 6 ప్రో, రియల్‌మి యూ1 కు ఏఏ అంశాల్లో చెక్ పెట్టబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం..

Realme U1 vs Redmi Note 6 Pro
Realme U1 vs Redmi Note 6 Pro Display

ఈ రెండు ఫోన్‌లకు సంబంధించిన డిస్‌ప్లే సామర్థ్యాలను మనం పరిశీలించినట్లయితే, రియల్‌మి యూ1 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డి+ డ్యూడ్రాప్ డిస్‌ప్లేతో ఎక్విప్ అయి ఉంటుంది. స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 2340 x 1080 పిక్సల్స్, యాస్పెక్ట్ రేషియో వచ్చేసరికి 19.5:9. స్ర్కీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 83.9%. రియల్‌మి యూ1 డిస్‌ప్లేకు టియర్ డ్రాప్ నాట్చ్ మరో ప్రధానమైన హైలైట్‌గా చెప్పొచ్చు. ఈ నాట్చ్ కారణంగా ఫోన్‌కు ప్రీమియమ్ లుక్ అనేది వచ్చేసింది. ఈ నాట్చ్‌లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా హౌస్ అయి ఉంటుంది.

ఇక రెడ్‌మి నోట్ 6 ప్రో విషయానికి వచ్చేసరికి, ఈ ఫోన్ 6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డి+ డిస్‌ప్లేతో ఎక్విప్ అయి ఉంది. స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1080 x 2280 పిక్సల్స్, యాస్పెక్ట్ రేషియో వచ్చేసరికి 19:9. స్ర్కీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 81.1%గా ఉంది. ఈ ఫోన్ అంచులు ఎక్కువుగా కనిపించటం, నాట్చ్ కూడా పెద్దదిగా ఉండటం వంటి అంశాలు రెడ్‌మి నోట్ 6 ప్రోకు సాధారణ లుక్‌ను తీసుకువచ్చాయి. దీంతె ఈ ఫోన్ డిస్‌ప్లే విభాగంలో  రియల్‌మి యూ1 ముందు తేలిపోయింది.

Realme U1 vs Redmi Note 6 Pro Design
Realme U1 vs Redmi Note 6 Pro Design

ఇక డిజైన్ విషయానికి వచ్చేసరికి రెడ్‌మి నోట్ 5 ప్రో తరహాలోనే రెడ్‌మి నోట్ 6 ప్రో కూడా యునిబాడీ మోటాలిక్ బ్యాక్ విత్ ప్లాస్టిక్ యాంటెన్నా స్ట్రిప్స్‌ను కలిగి ఉంది. రేర్ కెమెరాను ఒక కార్నర్‌లో ఎంఐ ఏ2 తరహాలో వెర్టికల్‌గా అలైన్ చేసి ఉంచారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికి, ఈ ఫోన్ కు సంబంధించి నాన్-బ్లాక్ వేరియంట్స్ మాత్రం చూడటానికి ఎబ్బెట్టుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మెటాలిక్ ఎక్స్‌టీరియర్ అవుట్ డేటెడ్ లుక్‌ను కలిగిస్తుంది.

ఇక రియల్‌మి యూ1 విషయానికి వచ్చేసరికి, ఈ డివైస్‌కు ప్రీమియమ్ లుక్‌ను తీసుకువచ్చే క్రమంలో గ్లోసీ గ్లాస్-తరహా ప్యానల్‌ను ఫోన్ వెనుక భాగంలో రియల్‌మి ఎక్విప్ చేసింది. అయితే, ఈ ప్యానల్‌ను జాగ్రత్తగా కాపాడుకోవల్సి ఉంటుంది. కలర్ వేరియంట్స్ విషయానికి వచ్చేసరికి రియల్‌మి యూ1.. యాంబీషియల్ బ్లాక్, బ్రేవ్ బ్లు ఇంకా ఫైరీ గోల్డ్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫ్యాన్సీ కలర్స్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటు వివిధ రకాల యాంగిల్స్‌లో రంగులను ప్రతిబింభిస్తాయి. రియల్‌మి యూ1 అంచులు చేతులకు మంచి గ్రిప్‌ను ఇస్తున్నప్పటికి మెటాలిక్ ఫోన్‌లతో పోలిస్తే మరింత ఎక్కువుగా జారే స్వభావాన్ని కలిగి ఉన్నాయి.

Realme U1 Hardware Specs
Realme U1 vs Redmi Note 6 Pro

ఇక హార్డ్‌వేర్ విషయానికి వచ్చేసరికి రియల్‌మి యూ1, మీడియాటెక్ హీలియో పీ70 2.1గిగాహెట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్‌కు అటాచ్ చేసిన ఆర్మ్ జీ72 జీపీయూ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని హ్యాండిల్ చేస్తుంది. ర్యామ్ ఇంకా స్టోరేజ్ అంశాలను పరిశీలించినట్లయితే ఈ ఫోన్ మొత్తం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ వచ్చేసరికి 3జీబి ర్యామ్ + 32 జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ, రెండవ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో లభ్యమవుతాయి. రియల్‌మి యూ1లో నిక్షిప్తం చేసిన MediaTek Helio P70 SoC, కొన్ని ఫోన్‌లలోని Snapdragon 660 SoCతో కంపేర్ చేసి చూసినట్లయితే ఎక్కువ స్కోర్లను నమోదు చేయటం విశేషం.

ఇక రెడ్‌మి నోట్ 6 ప్రో విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పవర్ అయి ఉంటుంది. ఈ ప్రాసెసర్‌కు అటాచ్ చేసిన అడ్రినో 502 జీపీయూ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని హ్యాండిల్ చేస్తుంది. ర్యామ్ ఇంకా స్టోరేజ్ అంశాలను పరిశీలించినట్లయితే ఈ ఫోన్ మొత్తం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ, రెండవ వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో లభ్యమవుతుంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవచ్చు.

Realme U1 vs Redmi Note 6 Pro
Redmi Note 6 Pro Software

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి రియల్‌మి యూ1, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా కస్టమైజ్ చేయబడిన కలర్‌ఓఎస్ 5.2 పై రన్ అవుతుంది. అన్ని రకాల గూగుల్ సర్వీసులు ఈ ఫోన్‌లో ప్రీ-ఇన్‌స్టాల్ కాబడి ఉంటాయి. ఈ ఫోన్‌లో లోడ్ చేసిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇంజిన్ రియల్–టైమ్ ట్రాన్స్‌లేషన్‌తో పాటు ఫాస్ట్ ఫేస్ అన్‌లాక్, స్ప్లిట్ స్ర్కీన్ అండ్ నేవిగేషన్ గెస్ట్యర్స్‌ ను ఆఫర్ చేయగలుగుతుంది. ఫాస్ట్ యాప్ లాంచెస్, క్విక్ షార్ట్ కట్స్, వెదర్, ప్యాకేజ్ ట్రాకింగ్, ఫ్లైట్ ఇన్ఫో,  అపాయింట్‌మెంట్స్ వంటి టాస్కులను నిర్వహించే సమయంలో బిహేవియర్ మోడల్స్‌ను  ఈ ఇంజిన్ ఉపయోగించుకుంటుంది.

ఇక నోట్ 6 ప్రో విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా కస్టమైజ్ చేయబడిన షావోమి ఎంఐయూఐ 10 పై రన్ అవుతుంది. ఈ యూజర్ ఇంటర్ ఫేస్ లో ఫుల్-స్ర్కీన్ హ్యాండ్ గెస్ట్యర్స్‌తో పాటు ఇంప్రూవుడ్ రీసెంట్ మెనూ ఆప్షన్ యాడ్ అయి ఉంటుంది. యాప్ లోడ్‌ను తగ్గించి, యూజర్ బిహేవియర్‌ను విశ్లేషించేందుకు గాను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని డివైస్ ఉపయోగించుకుంటుంది.

Redmi Note 6 Pro Software
Realme U1 vs Redmi Note 6 Pro

ఇక కెమెరా విషయానికి వచ్చేసరికి రెడ్‌మి నోట్ 6 ప్రో, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ కాంభినేషన్‌లో డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. వీటిలో ప్రైమరీ లెన్స్ f/2.2 అపెర్చుర్‌ను ఆఫర్ చేస్తుంది. ఇక, ఫోన్ ముందు భాగానికి వచ్చేసరికి ఇక్కడ కూడా 20 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌ను షావోమి ఏర్పాటు చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సీన్ డిటెక్షన్, నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లను ఈ డివైస్ సపోర్ట్ చేస్తుంది.

ఇక రియల్‌మి యూ1 విషయానికి వచ్చేసరికి, ఈ ఫోన్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ కాంభినేషన్‌లో డ్యుయల్ కెమెరా వ్యవస్థను రియల్‌మి సెటప్ చేసింది.  వీటిలో ప్రైమరీ లెన్స్ f/2.2 అపెర్చుర్‌ను, సెకండరీ లెన్స్ f/2.2 అపెర్చుర్‌ను ఆఫర్ చేస్తాయి. ఇక ఫోన్ ముందు భాగంలో ఎక్విప్ చేసిన 25 మెగా పిక్సల్ సోనీ IMX576 సెన్సార్.. ఎఫ్/2.0 అపెర్చుర్, 1.8-మైక్రాన్ పిక్సల్స్, 4ఇన్1 పిక్సల్స్ టెక్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ కెమెరాలో పొందుపరిచిన  ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బ్యూటీ ఫీచర్ 296 ఫేషియల్ రికగ్నిషన్ పాయింట్లను స్కాన్ చేస్తుంది. పోర్ట్రెయిట్ లైటింగ్ మోడ్‌ను కూడా ఈ కెమెరా ఆఫర్ చేయగలుగుతుంది.   

Realme U1 vs Redmi Note 6 Pro
Realme U1 vs Redmi Note 6 Pro Battery comparison

ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసరికి రియల్‌మి యూ1, 3,500mAh బ్యాటరీ పై రన్ అవుతుంది. ఇదే సమయంలో రెడ్‌మి నోట్ 6 ప్రో 4,000mAh పవర్ యూనిట్‌తో వస్తోంది. ఈ రెండు ఫోన్‌లు ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయవు.

ఈ రెండు ఫోన్‌లను అనేక అంశాల్లో కంపేర్ చేసి చూడగా రెడ్‌మి నోట్ 6 ప్రోతో పోలిస్తే రియల్‌మి యు1 దే పై చేయిగా అనిపిస్తోంది. 11,999 రూపాయిల ప్రారంభ ధర ట్యాగ్‌లో లభ్యమవుతోన్న రియల్‌మి యు1లో శక్తివంతమైన చిప్‌సెట్‌తో పాటు ప్రీమియమ్ డిజైన్, డీసెంట్ ఫ్రంట్ కెమెరా ఇంకా స్పెక్స్ ఉన్నాయి. ఇక రెడ్‌మి నోట్ 6 ప్రో విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ డిజైన్ చాలా పాతదిగా అనిపిస్తోంది. కెమెరా, బ్యాటరీ ఇంకా ర్యామ్ పరంగా ఈ ఫోన్ పర్వాలేదనిపిస్తుంది. ఇక బడ్జెట్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్‌కు సంబంధించిన 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంటుంది. ఇదే సమయంలో 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. ఈ రెండు ఫోన్‌ల ఎంపిక విషయంలో తుది నిర్ణయం అనేది మీ చేతుల్లోనే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.