Realme 3 లాంచ్ అయ్యింది, ధర, స్పెసిఫికేషన్స్, సేల్ తేదీ

Realme 3
Realme 3 లాంచ్ అయ్యింది, ధర, స్పెసిఫికేషన్స్, సేల్ తేదీ

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మీ (Realme), రియల్‌మీ 3 పేరిట సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మొత్తం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ వచ్చేసరికి 3జీబి ర్యామ్+ 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో  లభ్యమవుతుంది. ఖరీదు రూ.8,999.

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మీ (Realme), రియల్‌మీ 3 పేరిట సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మొత్తం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది

ఇక రెండవ వేరియంట్ వచ్చే సరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో  అందుబాటులో  ఉంటుంది. ఖరీదు రూ.10,999. మార్చి 12వ తేదీ నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఫ్లిప్‌కార్ట్‌లో  ఈ ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. బ్లాక్, డైనమిక్ బ్లాక్ ఇంకా రేడియంట్ బ్లు కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి.

ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్స్..

6.2 ఇంచ్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే (1520×720) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,  ఆండ్రాయిడ్ 9.0 Pie ఆపరేటింగ్ సిస్టం, 2.1గిగాహెట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్,  ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు  విస్తరించుకునే అవకాశం.

13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యయల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ పీడీఎఫ్ ఫాస్ట్ ఫోకసింగ్, 5 పిక్సల్ లెన్స్, హైబ్రీడ్ హెచ్‌డిఆర్ అండ్ పోర్ట్రెయిట్ మోడ్, 13 మెగా పిక్సల్ ఆర్టిఫీషియల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్  బ్యూటిఫికేషన్,  ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫేస్ అన్‌లాక్, 720 పిక్సల్ స్లోమోషన్ రికార్డింగ్, 4230 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.