Oppoదే మొదటి 5జీ వీడియో కాల్!

Oppoదే మొదటి 5జీ వీడియో కాల్!

5జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని ప్రపంచపు మొట్టమొదటి మల్టీపార్టీ వీడియో కాల్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లో విజయవంతంగా పూర్తి చేసినట్లు ఒప్పో(Oppo) అనౌన్స్ చేసింది. ఈ వీడియో కాల్‌ను షెంజన్, చైనా కాలమానం ప్రకారం అర్థరాత్రి 12.57 నిమిషాలకు నిర్వహించినట్లు ఒప్పో వెల్లడించింది. మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వుయ్‌చాట్ (WeChat) ద్వారా నిర్వహించిన ఈ వీడియో కాల్‌లో  వివిధ దేశాల్లోని ఒప్పొ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్‌ట్యూట్స్‌కు చెందిన 6గురు ఇంజినీర్లు పాల్గొన్నట్లు ఒప్పో తెలిపింది.

Oppo 5G
Oppo 5G Video Call

ఈ వీడియో కాల్‌కు సంబంధించిన ఫుటేజ్‌ను కూడా ఒప్పో రివీల్ చేసింది. ఈ ఫుటేజ్ ప్రకారం, ఒప్పో ఆర్15 (Oppo R15) 5జీ వెర్షన్ ఫోన్‌లో ఈ వీడియో కాల్ జరిగింది. 100 MHz బ్యాండ్ విడ్త్‌లో 17 నిమిషాల పాటు సాగిన ఈ వీడియో కాల్  “Hello OPPO, Hello 5G” అనే ప్రారంభ మేసేజ్‌తో ప్రారంభయ్యిందట. ఈ 5జీ టెస్ట్‌లో భాగంగా ప్రోటోకాల్ ఇంకా ఆర్ఎఫ్ పెర్ఫామెన్స్ వ్యాలిడేషన్ నిమిత్తం కీసైట్స్ యూఎక్స్ఎమ్ టెక్స్ట సెట్‌తో పాటు 5జీ న్యూ రేడియో నెట్‌వర్క్ ఇమ్యులేషన్ సొల్యూషన్స్‌ను ఒప్పో వినియోగించింది.

Oppo 5G Network
Oppo 5G Network

5జీ టెక్నాలజీస్ విభాగంలో ఇప్పటికే ఒక మార్గదర్శిగా వ్యవహరిస్తోన్న ఒప్పో, గడిచిన ఆగష్టులోనే 5జీ సిగ్నలింగ్ ఇంకా డేటా కనెక్షన్‌ను తన స్మార్ట్‌ఫోన్‌లో కంప్లీట్ చేయటం జరిగింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 5జీ ఇంటర్నెట్ యాక్సిస్ టెస్ట్‌‌ను కూడా అక్టోబర్‌లో పూర్తి చేసింది. తాజాగా ఈ ఫోన్ నుంచే ప్రపంచపు మొట్టమొదటి మల్టీపార్టీ వీడియో కాల్‌ను ఒప్పో పూర్తి చేయటం కంపెనీ టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్స్‌కు అద్దం పడుతోంది. ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే ఒప్పో మొదటి కమర్షియల్ 5జీ ఫోన్ ఎంతో దూరంలో లేదన్న వాస్తవం స్పష్టమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.