మరికొద్ది సేపట్లో జియోఫోన్ 2 రెండవ ఫ్లాష్ సేల్, పాల్గొనేందుకు ఇలా చేయండి

jiophone 2
మరికొద్ది సేపట్లో జియోఫోన్ 2 రెండవ ఫ్లాష్ సేల్, పాల్గొనేందుకు ఇలా చేయండి

జియోఫోన్ 2 (Jio Phone 2) సంబంధించి రెండవ ఫ్లాష్‌సేల్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. జియో అఫీషియల్ వెబ్‌సైట్ అయిన జియో.కామ్ (Jio.com)లో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది. నేటి సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకునే యూజర్లు నిర్ణీత సమయం కంటే ముందే Jio.comలోకి వెళ్లినట్లయితే సేల్ స్టార్ట్ అయిన వెంటనే ఫోన్‌ను ఆర్డర్ చేసే వీలుంటుంది. జియోఫోన్ 2కు సంబంధించి ఆగష్టు 16న నిర్వహించిన మొదటి ఫ్లాష్‌సేల్ నిమిషాల వ్యవధిలో ముగిసింది. ఈ ఫోన్‌లు లిమిటెడ్ స్టాక్‌లో మాత్రమే అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది యూజర్లు ఈ ఫోన్‌ను సొంతం చేసుకోలేక పోతున్నారు.

జియో ఫోన్ 2 స్పెసిఫికేషన్స్.. 2.4 ఇంచ్ హారిజెంటల్ స్ర్కీన్ డిస్‌ప్లే, ఫుల్ క్వెర్టీ కీప్యాడ్ అండ్ ఫోర్-వే నేవిగేషన్ ప్యాడ్, kia మొబైల్ ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ 205 లేదా స్ప్రెడ్‌ట్రమ్ SC9820 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కేమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గూగుల్ వాయిస్ కమాండ్స్ ద్వారా జియోఫోన్ 2ను కంట్రోల్ చేసుకోవచ్చు. డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ సౌలభ్యంతో వస్తోన్న ఈ డివైస్‌లో 4జీ ఎల్టీఈ విత్ VoLTE , VoWi-Fi, ఎఫ్ఎమ్, బ్లుటూత్, జీపీఎస్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ వంటి స్టాండర్డ్ కమ్యూనికేషన్స్ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇక యాప్స్ విషయానికి వచ్చేసరికి ఫేస్‌బుక్, యూట్యూబ్, గూగుల్
మ్యాప్ వంటి ఉపయుక్తమైన అప్లికేషన్‌లను జియోఫోన్ 2 క్యారీ చేస్తుంది. వీటితో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో మ్యూజిక్, జియో చాట్ వంటి యాప్స్ ప్రీమియమ్ కంటెంట్‌ను ఆఫర్ చేస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.