ఇక పై మీ వాట్సాప్ అకౌంట్ నుంచే PNR స్టేటస్ తెలుసుకోవచ్చు

ఇక పై మీ వాట్సాప్ అకౌంట్ నుంచే PNR స్టేటస్ తెలుసుకోవచ్చు
ఇక పై మీ వాట్సాప్ అకౌంట్ నుంచే PNR స్టేటస్ తెలుసుకోవచ్చు

నిన్న మొన్నటి వరకు PNR స్టేటస్ లేదా లైవ్ ట్రెయిన్ స్టేటస్‌ వివరాలను తెలుసుకోవాంటే రైల్వే రిజర్వేషన్ ఎంక్వైరీ నెంబర్ (139)కి కాల్ చేయటం లేదా ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్‌డేట్‌లను తెలుసుకోవల్సి వచ్చేది. ఈ ప్రాసెస్ చాలా కష్టతరంగా ఉండటంతో ప్రయాణీకులు చాలా ఇబ్బందులు పడేవాళ్లు.

తాజగా ఈ ప్రాసెస్‌ను మరింత సులభతరం చేస్తూ ఇండియన్ రైల్వేస్, ఆన్‌లైన్ ట్రావెల్ వెబ్‌సైట్ అయిన మేక్‌మై‌ట్రిప్‌తో ఒప్పందం కుదర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ప్రయాణికులకు సంబంధించి పీఎన్ఆర్ స్టేటస్, లైవ్ ట్రెయిన్ స్టేటస్ వంటి అప్‌డేట్‌లను వారివారి వాట్సాప్ నెంబర్‌లకు మేక్‌మై‌ట్రిప్‌ పంపుతుంది. వాట్సాప్ ద్వారా PNR స్టేటస్‌ను ఏ విధంగా చెక్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read : OLXలో భారీగా పెరుగుతోన్న pre-owned స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు

ఈ ప్రొసీజర్ మీ ఫోన్‌లో వర్క్ అవ్వాలంటే ముందుగా మీ డివైస్‌లోని వాట్సాప్ అప్లికేషన్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. స్టేటస్ తెలుసుకునే క్రమంలో ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ వర్కింగ్ కండీషన్‌లో ఉండాలి. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని ‘Dialer’ యాప్‌ను ఓపెన్ చేయండి. ఆ తరువాత మేక్‌మై‌ట్రిప్ అఫీషియల్ వాట్సాప్ నెంబర్ అయిన ‘7349389104’ను కాంటాక్ట్స్ లిస్టులో సేవ్ చేసుకోండి.

నెంబర్‌ను సేవ్ చేసుకున్న తరువాత వాట్సాప్‌ను ఓపెన్ చేసి కాంటాక్ట్స్ లిస్టును రీఫ్రెష్ చేయండి. లిస్ట్ రీఫ్రెష్ అయిన తరువాత మేక్‌మై‌ట్రిప్ అఫీషియల్ వాట్సాప్ నెంబర్‌ను ప్రత్యేకమైన చాట్ విండోలో ఓపెన్ చేసి మీ పీఎన్ఆర్ నెంబర్‌ను ఎంటర్ చేసి సెండ్ చేయాలి. మెసేజ్ సెండ్ అయిన వెంటనే రియల్ టైమ్‌లో మీ పీఎన్ఆర్ నెంబర్‌కు సంబంధించిన బుకింగ్ స్టేటస్‌ను మేక్‌మై‌ట్రిప్ మీకు సెండ్ చేస్తుంది. లైవ్ ట్రెయిన్ స్టేటస్ వివరాలను తెలుసుకోవాలనుకున్నట్లయితే సంబంధిత ట్రెయిన్ నెంబర్‌ను సెండ్ చేస్తే సరిపోతుంది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.