మార్కెట్లోకి Gionee F205 Pro, ధర రూ.5,890

Gionee F205 Pro
మార్కెట్లోకి Gionee F205 Pro, ధర రూ.5,890

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం జియోనీ (Gionee), ఎఫ్205 ప్రో పేరుతో  సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.  ఖరీదు రూ.5,890.  Flipkartలో సేల్ మొదలైంది. బ్లాక్, బ్లూ ఇంకా ఛాంపేన్ కలర్ వేరియంట్‌లలో  ఈ ఫోన్ లభ్యమవుతోంది.

జియోనీ ఎఫ్205 ప్రో (Gionee F205 Pro ) ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్స్..

5.45 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ 18:9 ఫుల్ వ్యూ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1440 x 720 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, మీడియాటెక్ MT6739WW 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ VoLTE, బ్లుటూత్ 4.1,  వై-ఫై 802.1111b/g/n), మైక్రో యూఎస్బీ పోర్ట్, 3.5ఎమ్ఎమ్ హెడ్ ఫోన్ జాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్,  ఫేస్ అన్‌లాక్.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.