ఈ యాక్షన్ కెమెరా ఖరీదు రూ.4,999 మాత్రమే, డిసెంబర్ 17 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు

Yi Action Camera
ఈ యాక్షన్ కెమెరా ఖరీదు రూ.4,999 మాత్రమే, డిసెంబర్ 17 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు

చైనాకు చెందిన ప్రముఖ కెమెరాల తయారీ కంపెనీ వై టెక్నాలజీస్ (Yi Technologies), భారత్‌లో తన వై యాక్షన్ కెమెరా (Yi Action Camera)ఇంకా వై 4కే యాక్షన్ కెమెరా(Yi 4K Action Camera)లను లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. డిసెంబర్ 17 నుంచి ఈ కెమెరాలో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి.  ప్రారంభ మోడల్ ధరరూ.4,999. 

వీటిలో మొదటి మోడల్ అయిన వైయాక్షన్ కెమెరాలో ఎక్స్‌మార్ ఆర్ ఎబిలిటీతో కూడిన 16 మెగా పిక్సల్ సోనీ IMX206 CMOS ఇమేజ్ సెన్సార్, 155 – డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ ఇంకా హై-పెర్ఫామెన్స్జీ-సెన్సార్‌లు ఎక్విప్ అయి ఉంటాయి.

ఈ యాక్షన్ కెమెరా ఖరీదు రూ.4,999 మాత్రమే, డిసెంబర్ 17 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు

ఈ కెమెరాకు F2.8 అపెర్చుర్‌తో కూడిన Ambarella A7LS ఇమేజ్ ప్రాసెసర్ శక్తిని సమకూరుస్తుంది. ఈ కెమెరా స్టోరేజ్‌ను 64జీబి వరకు ఎక్స్‌ప్యాండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కెమెరా సింగిల్ ఛార్జ్ పై 90 నిమిషాల ఫుటేజ్‌ను ఎటువంటి అంతరాయంలేకుండా రికార్డ్ చేయగలుగుతుందట. 

వై యాక్షన్ కెమెరా ద్వారా అల్ట్రా-హైడెఫినిషన్ వీడియోలతో పాటు ఫోటోలను అడ్వాన్సుడ్ ఇమేజ్ స్టెబి‌లైజేషన్‌తో పాటు నాయిస్ రిడక్షన్‌తో రికార్డ్ చేసుకునే వీలుంటుదట. వీడియో లేదా ఫోటోను క్యాప్చుర్ చేసేటపుడు కంటెంట్‌కు అనుగుణంగా 11 రకాల వీడియో రిసల్యూషన్ మోడ్స్‌తో పాటు 5 రకాల ఫోటో మోడ్స్‌ను ఎంపికచేసుకునే వీలుంటుందట.

ఈ కెమెరాలో బిల్ట్-ఇన్ మైక్రోఫోన్‌ విత్ డ్యుయల్ – ఛానల్ఆడియో, 96KHz శాంప్లింగ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, మైక్రోఎస్డీ స్లాట్, వైర్‌లెస్ కనెక్టువిటీ నిమిత్తం వై-ఫై ఇంకా బ్లుటూత్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.      

ఈ యాక్షన్ కెమెరా ఖరీదు రూ.4,999 మాత్రమే, డిసెంబర్ 17 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు

ఇక వై 4కే యాక్షన్ కెమెరా ((Yi 4K Action Camera)) విషయానికి వచ్చేసరికి ఈ కెమెరాలో ఎక్స్‌మార్ ఆర్ ఎబిలిటీతో కూడిన 12మెగా పిక్సల్ SONY IMX377 CMOS ఇమేజ్ సెన్సార్‌తో  పాటు 155 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్  విత్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 3యాక్సిస్ యాక్సిలరోమీటర్, 3 యాక్సిస్ గైరో స్కోప్ వంటి ఫీచర్స్ ఉంటాయి.  

ఈ కెమెరా 240fps వీడియో రికార్డింగ్‌ను 720 పిక్సల్ క్వాలిటీలో చేయగలుగుతుంది. ఇదే సమయంలో 4కే అల్ట్రా వీడియోలను 24fps ఫ్రేమ్ రేటుతో ఈ కెమెరా రికార్డ్ చేయగలుగుతుందట. ఈ కెమెరాకు డ్యుయల్ కోర్ కార్టెక్స్-ఏ9 ఆర్మ్ సీపీయూతో కూడిన  Ambarella A9SE చిప్‌సెట్ శక్తిని సమకూరుస్తుందట. వెళుతురు కండీషన్స్‌‌ను బట్టి పారామీటర్స్‌ను అడ్జస్ట్  చేసుకునే విధంగా ఆటో లో లైట్, లెన్స్ డిస్టార్షన్ కరెక్షన్ వంటి ఫీచర్స్ ఈ కెమెరాలోఎక్విప్ చేసినట్లు కంపెనీ తెలపిింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ కెమెరా ధర రూ.9,999గా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.