బీఎస్ఎన్ఎల్ ‘రాఖీ ఆఫర్’, రూ.399కే అంతా ఉచితం

బీఎస్ఎన్ఎల్ ‘రాఖీ ఆఫర్’, రూ.399కే అంతా ఉచితం

రాఖీ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ‘రాఖీ ఆఫర్’ పేరిట సరికొత్త ఎస్టీవీ ప్లాన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ప్లాన్ ఖరీదు రూ.399. వ్యాలిడిటీ 74 రోజులు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్‌తో పాటు అన్‌లిమిటెడ్ డేటా ఇంకా ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్ పిరియడ్‌లో పర్సనలైజిడ్ రింగ్ బ్యాక్ టోన్ సౌకర్యం కూడా యూజర్లకు అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఆగష్టు 26 నుంచి ఈ ప్లాన్ అందుబాటులోకి వస్తుంది.

ఇటీవల ‘ఫ్రీడమ్ ప్యాక్’ పేరుతో ఓ స్పెషల్ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్ క్రింద రెండు కొత్త ప్యాక్‌లను బీఎస్ఎన్ఎల్ అందుబాటులో ఉంచింది. రూ.9 ఇంకా రూ.29 ధర ట్యాగ్‌లలో ఈ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. ఈ రెండు ప్లాన్స్ అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు 3జీ మొబైల్ డేటాను ఆఫర్ చేస్తాయి. వీటితో పాటు ఆంధ్ర, తెలంగాణ సర్కిళ్లను ఉద్దేశించి జీవితా ప్రీపెయిడ్ ప్లాన్ పేరుతో సరికొత్త ప్యాక్ ను బీఎస్ఎన్ఎల్ అనౌన్స్ చేసింది. ఈ ప్లాన్ ఖరీదు రూ.75.

15 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా 10జీబి 3జీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ అలానే మెసేజెస్ అందుబాటులో ఉంటాయి. ఇక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ విషయానికి వచ్చేసరికి Fibro BBG ULD 995 పేరుతో సరికొత్త ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ అనౌన్స్ చేసింది. ఈ ప్లాన్ ప్రత్యేకించి కేరళ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. 90 రోజుల వ్యాలిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా మొదటి 200జీబి డేటా 20 ఎంబీపీఎస్ స్పీడుతో అందుబాటులో ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.