Asus ఫోన్‌ల పై రూ.5000 వరకు తగ్గింపు, లిస్ట్ ఇదే

Asus zenfone price cut
Asus ఫోన్‌ల పై రూ.5000 వరకు తగ్గింపు, లిస్ట్ ఇదే

ఇటీవల మార్కెట్లో లాంచ్ చేసిన 15 స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ఆండ్రాయిడ్ పై (Android pie) అప్‌డేట్‌ను అనౌన్స్ చేసిన ఆసుస్(Asus) తాజాగా పలు స్మార్ట్‌ఫోన్ మోడల్స్ పై ధర తగ్గింపును అనౌన్స్ చేసింది. తగ్గింపును అందుకున్న ఫోన్ల  జాబితాలో  జెన్‌ఫోన్ మాక్స్ ప్రో ఎమ్1  (Zenfone Max Pro M1), జాబితాలో  జెన్‌ఫోన్ మాక్స్ ప్రో ఎమ్2 (Zenfone Max Pro M2), (Zenfone Max M2), జెన్‌ఫోన్ 5జెడ్  (Zenfone 5Z)లు ఉన్నాయి.

తాజాగా అనౌన్స్ చేసిన శాస్వుత ధర తగ్గింపులో భాగంగా జెన్‌ఫోన్ మాక్స్ ప్రో ఎమ్1 (3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్  వెర్షన్) ధర రూ.8,499కే లభ్యమవుతుంది. 4జీబి , 6జీబి ర్యామ్  మోడల్స్ ధరలను రూ.10,499, రూ.12,499గా కంపెనీ ఫిక్స్ చేసింది. ఆసుస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌లో ఒకటైన జెన్‌ఫోన్ 5జెడ్ రూ.5000 తగ్గింపుతో రూ.24,999కే లభ్యమవుతుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన 6జీబి, 8జీబి  ర్యామ్  మోడల్స్ ధరలను రూ.27,999, రూ.31,999గా కంపెనీ ఫిక్స్ చేసింది.

ఇక జెన్‌ఫోన్ మాక్స్ ప్రో ఎమ్2 విషయానికి వచ్చేసరికి,  ఈ ఫోన్‌కు సంబంధించిన 3జీబి ర్యామ్ వేరియంట్  ఇప్పుడు  రూ.9,999కే లభ్యమవుతుంది. 4జీబి ఇంకా 6జీబి ర్యామ్ వెర్షన్‌లు రూ.11,999,రూ.13,999కే లభ్యమవుతున్నాయి. జెన్‌ఫోన్ మాక్స్ ఎమ్2 విషయానికి వచ్చేసరికి,  ఈ ఫోన్‌కు సంబంధించిన 3జీబి ర్యామ్ వేరియంట్  ఇప్పుడు  రూ.8,499కే లభ్యమవుతుంది. 4జీబి ర్యామ్ మోడల్ రూ.500 తగ్గింపుతో రూ.10,499కే అందుబాటులో ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.