కేరళ వరద బాధితుల కోసం Asus ఉచిత సర్వీస్ క్యాంప్

asus suport to kerala flood hit areas
కేరళ వరద బాధితుల కోసం Asus ఉచిత సర్వీస్ క్యాంప్

కేరళ వరద బాధితులకు సహాయంగా ఆయా ప్రాంతాల్లో ఉచిత సర్వీస్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు Asus తెలిపింది. ఆగష్టు 30వ తేదీన  ప్రారంభమైన ఈ ఉచిత సర్వీస్ సెప్టంబర్ 10 వరకు కేరళలోని అన్ని Asus సర్వీస్ సెంటర్‌లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ 10 రోజుల ఉచిత సర్వీస్ క్యాంపులో భాగంగా కస్టమర్‌ల వద్ద నుంచి ఎటువంటి లేబర్ ఛార్జ్ వసూలు చేయకుండా సర్వీస్ చేస్తామని కంపెనీ తెలిపింది.

Also Read : షియోమీ నుంచి కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్.. Redmi 6, Redmi 6A, Redmi 6 Pro

ఈ క్యాంపులో భాగంగా వాటర్ డామెజిడ్ పార్ట్స్ పై 50శాతం వరకు డిస్కౌంట్‌లను ఇవ్వటం జరుగుతుందని కంపెనీ తెలిపింది. ఈ డిస్కౌంట్స్ అనేవి ఇన్-వారంటీ ప్రొడక్ట్స్ పై మాత్రమే వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా Asus సర్వీస్ సెంటర్స్ వివరాలను ఈ లింక్ పై క్లిక్ చేయటం ద్వారా తెలుసుకోవచ్చు.

Also Read : మార్కెట్లోకి మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌లు Motorola One, Motorola One Power

సర్వీస్ క్యాంప్ లాంచ్ సందర్భంగా ఆసుస్ ఇండియా రీజినల్ హెడ్ లియోన్ యు స్పందిస్తూ ప్రకృతి విపత్తలను తాము అర్థం చేసుకోగలమని ఇటువంటి పరిస్థితుల్లో బాధితుల పక్షాన నిలబడటమన్నది చాలా గొప్పపని అని, కేరళలోని ఆసుస్ కస్టమర్లు తాము అందిస్తోన్న చిరు సహాయాన్ని స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు..

ఆసుస్ బాటలోనే షియోమీ (Xiaomi), హువావే (Huawei)లు కూడా కేరళ వరద బాధితులకు తమ సపోర్టును అనౌన్స్ చేసింది. నీటిలో పడి దెబ్బతిన్న తమ మొబైల్ ఫోన్‌లను ఫ్రీ-ఆఫ్-కాస్ట్ రిపేర్ సర్వీస్ క్రింద ఉచితంగా సర్వీస్ చేసి ఇస్తామని ఆయా కంపెనీలు తెలిపాయి. వీటితో పాటుగా గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, అమెజాన్ వంటి దిగ్గజం టెక్ సంస్థలు కూడా కేరళ ప్రజలకు అండగా నిలిచాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.