Xiaomi స్మార్ట్‌టీవీ ధరలు తగ్గాయ్, చెక్ చేసుకోండి

Xiaomi Mi Led Tv
Xiaomi స్మార్ట్‌టీవీ ధరలు తగ్గాయ్, చెక్ చేసుకోండి

టీవీల పై జీఎస్టీ భారాన్ని28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చైనా టెక్ దిగ్గజం షావోమి తన ఎంఐ ఎల్ఈడి టీవీ (Mi LED TV)ల పై శాస్వత ధర తగ్గింపు అనౌన్స్ చేసింది.  

ధర తగ్గింపును అందుకున్న టీవీల జాబితాలో ఎంఐ ఎల్ఈడి స్మార్ట్ టీవీ 4ఏ 32 (Mi LED Smart TV 4A 32),  ఎంఐ ఎల్ఈడి టీవీ 4సీ ప్రో 32 (Mi LED TV 4C Pro 32), ఎంఐ ఎల్ఈడి టీవీ 4ఏ 49 (Mi LED TV 4A Pro 49) మోడల్స్ ఉన్నాయి.

వీటిలో  ఎంఐ ఎల్ఈడి స్మార్ట్ టీవీ 4ఏ 32 రూ.1500 తగ్గింపును తగ్గింపును అందుకుంది. లాంచ్ సమయంలో ఈ టీవీ ధర రూ.13,999గా ఉండేది. మరో మోడల్ ఎంఐ ఎల్ఈడి టీవీ 4సీ ప్రో 32 (Mi LED TV 4C Pro 32) రూ.2000 తగ్గింపుతో  రూ.13,999కే లభ్యమవుతోంది. చివరి మోడల్ అయిన  ఎంఐ ఎల్ఈడి టీవీ 4ఏ 49 రూ.1000 తగ్గింపుతో రూ.30,999కే అందుబాటులో ఉంటుంది. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చేసాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.