ఎల్‌జి నుంచి మడతపెట్టుకునే టీవీ వచ్చేస్తోంది!

LG Foldable Tv
ఎల్‌జి నుంచి మడతపెట్టుకునే టీవీ వచ్చేస్తోంది!

ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఎల్‌జీ (LG) ఎలక్ట్రానిక్స్, వచ్చే ఏడాది నుంచి ఫోల్డబుల్ టీవీలను మార్కెట్లో విక్రయించబోతున్నట్లు సమచారం. ఈ పెద్ద స్ర్కీన్ టీవీలను పోస్టర్‌లా మడత పెట్టేసుకోవచ్చట.

65 అంగుళాల స్ర్కీన్ సైజులను కలిగి ఉండే ఈటీవీలు గ్యారేజ్ డోర్ తరహాలో బటన్ పై టచ్ చేసిన వెంటనే వాటంతటకవే ముడుచుకు పోతాయట. ఈ టీవీలు సులువుగా ఫోల్డ్ అయ్యేందుకు వీలుగా ఓఎల్ఈడి (ఆర్గానిక్ లైట్-ఎమిటింగ్ డయోడ్) స్ర్కీన్‌లను వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ స్ర్కీన్‌లు సాంప్రదాయ లిక్విడ్-క్రిస్టల్ డిస్‌ప్లే ప్యానల్స్‌తో పోలిస్తే మడత పెట్టేందుకు మరింత అనువుగా ఉంటాయట.

Also Read : రేపటి నుంచే Xiaomi No. 1 Mi Fan Sale, స్మార్ట్‌ఫోన్‌ల పై ఆఫర్లే ఆఫర్లు

స్మార్ట్ టీవీల విభాగంలో రోజురోజుకు పెరిగిపోతోన్న కాంపిటీషన్‌ను దృష్టిలో ఉంచుకుని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ గతకొంతకాలంగా విప్లవాత్మక ఆవిష్కరణల ఫోకస్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో రోలబుల్ ఇంకా ఓఎల్ఈడి  టెలివిజన్స్ పై ఎల్‌జీ తన రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇటీవల ఓ ప్రోటోటైప్ టెలివిజన్‌ను సియోల్‌లోని తన రిసెర్చ్ సెంటర్‌లో ఎల్‌జీ ప్రదర్శించింది. ఈ టీవీని ఎప్పడు కావాలంటే అప్పుడు మడత పెట్టేసుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకు వెళ్లిపోవచ్చు.

ఎల్‌జీ, తాను అభివృద్థి చేసిన రోలబుల్ స్ర్కీన్ టెక్నాలజీని 2018 ఆరంభంలోనే ప్రపంచానికి పరిచయం చేసినప్పటికి ఇంకా కమర్షియల్‌గా మార్కెట్లోకి తీసుకురాలేక పోయింది. అయితే  2019లో ఇది సాధ్యపడొచ్చని  మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read : whatsApp కొత్త ఫీచర్ Picture-in-Picture, ఇకవీడియోలు చూస్తూనే చాటింగ్ చేసుకోవచ్చు..

2018కుగాను ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న  టీవీల అమ్మకాలకు సంబంధించి ట్రాకర్‌శాటిస్టా రివీల్ చేసిన వివరాల ప్రకారం ఎల్‌సీడీ టీవీలు అమ్మకాలు 98 శాతంగా ఉన్నాయి. ఇదే సమయంలో  ఓఎల్ఈడి  టీవీలు అమ్మకాల సంఖ్య 1.1 శాతంతో చాలా తక్కువుగా ఉంది. ఓఎల్ఈడి టీవీల అమ్మకాలు ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నప్పటికి 2019 పూర్తయ్యే నాటికి 70 శాతాని కిపెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.