రూ.1699కే ZAAP ఆక్వా బ్లుటూత్ స్పీకర్, నీటిలో తడిచినా పాడవ్వదు…

ZAAP Aqua Bluetooth Speaker
రూ.1699కే ZAAP ఆక్వా బ్లుటూత్ స్పీకర్, నీటిలో తడిచినా పాడవ్వదు...

ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ జాప్ (ZAAP), తన ఆడియో స్పీకర్స్ విభాగంలోకి  సరికొత్త స్పీకర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. జాప్ ఆక్వా వాటర్‌ప్రూఫ్ బ్లుటూత్ స్పీకర్ పేరుతో ఈ స్పీకర్ అందుబాటులో ఉంటుంది.  ఐపీ67 రేటింగ్‌తో వస్తోన్న ఈ డివైస్ నీటిలో తడిచినప్పటికి చెక్కుచెదరదు. మార్కెట్లో ఈ స్పీకర్ ఖరీదు ధర రూ.1699గా ఉంటుంది. 

రూ.1699కే ZAAP ఆక్వా బ్లుటూత్ స్పీకర్, నీటిలో తడిచినా పాడవ్వదు...

రబ్బరైజిడ్ రగ్గుడ్ ఎక్స్‌టీరియర్‌ను కలిగి ఉండే స్పీకర్ నీటి చుక్కలను సమర్థవంతంగా తట్టుకోగలుగుతుంది. ఈ స్పీకర్‌తో వచ్చే రిమూవబుల్ సక్షన్ కప్ డివైస్‌కు మరింత ప్రొటెక్షన్‌ను కల్పిస్తుంది. ఐపీ67 రేటింగ్‌తో వస్తోన్న ఈ స్పీకర్ నీటి నుంచి, షాక్స్ నుంచి,  మంచు నుంచి ఇంకా దుమ్ము నుంచి తలెత్తే ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. ఈ స్పీకర్‌తో వచ్చే కారాబినీర్ క్లిప్ సహాయంతో  స్పీకర్‌ను ఎక్కడి నుంచి ఎక్కడికైనా సునాయాశంగా తీసుకువెళ్లే వీలుంటుంది. 

ఈ స్పీకర్ ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్ లను మాత్రమే కాకుండా ఐఓఎస్ ఇంకా విండోస్ డివైస్ లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చేసరికి ఈ స్పీకర్స్ సింగిల్ ఛార్జ్ పై 6 గంటల బ్యాకప్‌ను అందించగలుగుతాయట. బిల్ట్‌ఇన్ మైక్రోఫోన్‌తో వస్తోన్నఈ స్పీకర్‌ను బ్లుటూత్ సహాయంతో స్మార్ట్‌ఫోన్‌లకు కనెక్ట్ చేసుకుని ఫోన్ కాల్స్‌కు ఆన్సర్ చేసే వీలుంటుంది. ఈ స్పీకర్ యూసేజ్ రేంజ్ 33 అడుగులుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 

రూ.1699కే ZAAP ఆక్వా బ్లుటూత్ స్పీకర్, నీటిలో తడిచినా పాడవ్వదు...

ఈ స్పీకర్‌లో ఏర్పాటు చేసిన 3-వాట్ డ్రైవర్ పూర్తిస్థాయి 360 డిగ్రీ హైడెఫినిషన్ సరౌండ్ సౌండ్‌ను ప్రొడ్యూస్ చేయగలుగుతుందట. ఈ స్పీకర్.. స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్ వంటి డివైస్‌లకు 6 సెకన్ల కంటే తక్కువ వ్యవథిలో కనెక్ట్ కాగలుగుతుందట. బ్లుటూత్‌తో పెయిర్ చేసుకోవటం ద్వారా మరింత ఎనర్జీని ఆదా చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.  

జాప్ ఆక్వా వాటర్‌ప్రూఫ్ బ్లుటూత్ స్పీకర్‌ను ఆన్‌లైన్‌లో అమెజాన్ ఇండియాతో పాటు జాప్‌టెక్. కామ్‌లు విక్రయిస్తున్నాయి. ఆఫ్‌లైన్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రిటైల్ స్టోర్స్ వద్ద ఈ స్పీకర్ లభ్యమవుతుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.