మార్కెట్లోకి boAt Stone 230 బ్లుటూత్ స్పీకర్, ఖరీదు రూ.1299

boAt launches Stone 230 Bluetooth speaker at Rs 1,299

ముంబైకు చెందిన ప్రముఖ ఆడియో ఉపకరణాల తయారీ కంపెనీ బోట్ (boAt), స్టోన్ 230 (Stone 230) పేరుతో ఓ సరికొత్త బ్లుటూత్ స్పీకర్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఏడాది వారంటీతో వస్తోన్న ఈ స్పీకర్ ఖరీదు రూ.1299. అమెజాన్ ఇండియాలో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. చార్‌కోల్ బ్లాక్ ఇంకా మిడ్‌నైట్ కలర్ వేరియంట్‌లలో ఈ స్పీకర్ అందుబాటులో ఉంటుంది.

boAt Stone 230 Bluetooth speaker
boAt launches Stone 230 Bluetooth speaker at Rs 1,299

వైర్‌లెస్ కనెక్టువిటీ నిమిత్తం ఈ స్పీకర్‌లో బ్లుటూత్ 4.2 వెర్షన్‌ను ఎక్విప్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. కనెక్టువిటీ రేంజ్ 10 మీటర్ల వరకు ఉంటుందట. JL AC6905B అనే చిప్‌సెట్‌ను ఈ డివైస్‌లో వినియోగించారట. ఈ స్పీకర్‌లో నిక్షిప్తం చేసిన 1.5 ఇంచ్ స్పీకర్ 3 వాట్ పవర్ అవుట్ పుట్ ను ప్రొడ్యూస్ చేయగలుగుతుందట.

ఈ స్పీకర్ లో లోడ్ చేసిన 1200 ఎమ్ఏహెచ్ లిథియమ్-ఐయోన్ బ్యాటరీ సింగిల్ ఛార్జ్ పై 10 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను ఆఫర్ చేస్తుందట. బ్యాటరీ మొత్తం ఛార్జ్ అవటానికి మూడున్నర గంటల సమయం తీసుకుంటుందట. స్పీకర్ పై ఏర్పాటు చేసిన ఛార్జింగ్ ఇండికేటర్ ద్వారా ఛార్జింగ్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ఇదే సమయంలో కంట్రోల్ బటన్స్ ను కూడా స్పీకర్స్ పై అమర్చి ఉంటాయి.

ఈ స్పీకర్ రెస్పాన్స్ ఫ్రీక్వెన్సీ 2.4GHz-2.480GHz మధ్య ఉంటుంది. బిల్ట్-ఇన్ మైక్రోఫోన్స్‌తో వస్తోన్న ఈ స్పీకర్‌, మైక్రోయూఎస్బీ ఛార్జింగ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్, మైక్రో యూఎస్బీ పోర్ట్ వంటి కనెక్టువిటీ ఫీచర్స్ ఈ స్పీకర్ లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఐపీఎక్స్4 రేటింగ్ తో వస్తోన్న ఈ స్పీకర్ నీటి ప్రమాదాలను తట్టుకోగలగుతుందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.