360 డీగ్రీ వాటర్‌ఫాల్ టెక్నాలజీతో Haier కొత్త వాషింగ్ మెషీన్

Haier
360 డీగ్రీ వాటర్‌ఫాల్ టెక్నాలజీతో Haier కొత్త వాషింగ్ మెషీన్

ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ హెయర్ (Haier), సరికొత్త వాషింగ్ మెచీన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. HWM100-678NZP అనే మోడల్ నెంబర్‌తో ఈ వాషింగ్ మెచీన్ అందుబాటులో ఉంటుంది. 360 డీగ్రీ వాటర్‌ఫాల్ టెక్నాలజీతో వస్తోన్న ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెచీన్ ఖరీదు రూ.43,760.

ఈ మెచీన్‌లో లోడ్ చేసిన 360 డీగ్రీ వాటర్‌ఫాల్ టెక్నాలజీ, ఫ్యాబ్రిక్స్‌కు డీపర్ క్లీనింగ్‌తో పాటు అదనపు సంరక్షణను ఇవ్వగలుగుతుందని కంపెనీ చెబుతోంది. ఇందులోని డైరెక్ట్-మోషన్ ఇన్వర్టర్ మోటర్, మెచీన్ జీవిత కాలాన్ని పెంచటంతో పాటు 30 శాతం వరకు ఎనర్జీని ఆదా చేయగలుగుతుందట.

ఈ వాషింగ్ మెచీన్ లో అమర్చిన ఓసియానస్ వేవ్ డ్రమ్ బలమైన నీటి ప్రవాహాన్ని సృష్టించి తక్కువ రాపిిడితో లోతైన శుభ్రతను అందించగలుగుతుందట. మెచీన్‌ను సులువుగా ఆపరేట్ చేసుకునేందుకు వీలుగా టాప్ భాగంలో ప్రత్యేకమైన స్ర్కీన్‌ అమర్చబడి ఉంటుంది. 10 కిలలో సామర్థ్యంతో వస్తోన్న ఈ వాషీింగ్ మెషీన్‌ను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్స్ వద్ద కొనుగోలు చేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.