స్వచ్ఛమైన ప్రాణ వాయువు కోసం Dr. Aeroguard 660H ఎయిర్ ప్యూరిఫైర్

Dr. Aeroguard 660H
స్వచ్ఛమైన ప్రాణ వాయువు కోసం Dr. Aeroguard 660H ఎయిర్ ప్యూరిఫైర్

హెల్త్ ఇండ్ సేఫ్టీ సొల్యూషన్స్ విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న యురేకా ఫోర్బ్స్ (Eureka Forbes) బిల్ట్-ఇన్ హ్యూమిడిఫైర్‌తో కూడిన సరికొత్త ఎయిర్ ప్యూరిఫైర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. Dr. Aeroguard 660H పేరుతో ఈ ప్యూరిఫైర్‌ అందుబాటులో ఉంటుంది. ఖరీదు రూ.37,990.

శక్తివంతమైన హీపా ఫిల్టర్ (Hepa filter)తో వస్తోన్న ఈ ప్యూరిఫైర్‌ గాలిలోని మైక్రోపార్టికల్స్‌ను 99.97శాతం వరకు నిరోధించగలుగుతుందట. ఈ ఫిల్టర్ లో నిక్షిప్తం చేసిన యాంటీ-అలెర్జన్ ఇంకా యాంటీ-బ్యాక్టీరియల్ ఫిల్టర్స్ గాలిలో ప్రయాణించే కణాలను బంధించగలుగుతాయట.

Dr. Aeroguard 660H ఎయిర్ ప్యూరిఫైర్‌ను జర్మనీ చెందిన GUI lab సర్టిఫై చేసినట్లు యురేకా ఫోర్బ్స్ చెబుతోంది. ఇదే సమంయలో ఈ ప్యూరిఫైర్‌ లో నిక్షిప్తం చేసిన డ్యుయోట్రాన్ టెక్నాలజీ గాలిలో పెరిగే వైరస్‌లతో పాటు బ్యాక్టీరియాలను చురుకుగా నిరోధించగలుగుతుందట.

ఈ ప్యూరిఫైర్‌‌లో ఏర్పాటు చేసిన ఫిల్టర్ లైఫ్ ఇండికేటర్, ఫిల్టర్‌ను మార్చవల్సి వచ్చినపుడు అడ్వాన్సుగా యూజర్లను అలర్ట్ చేస్తుందట. ఈ ప్యూరిఫైర్ ను పూర్తిగా రిమోట్ కంట్రోల్ సహాయంతో ఆపరేట్ చేసుకునే వీలుంటుందట. యాంబియంట్స్ లైట్స్, ఫిల్టర్ ఛేంజ్ ఇండికేటర్, ఆరోమైజర్, చైల్డ్ లాక్, నైట్ మోడ్ వంటి స్పెషల్ ఫీచర్స్ ఈ ప్యూరిఫైర్‌‌లో అందుబాటులో ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.