Lloyd నుంచి కొత్త ఏసీలు, 45 సెకన్లలో రూమ్ అంతా కూల్ కూల్!

Llyod
Llyod నుంచి కొత్త ఏసీలు, 45 సెకన్లలో రూమ్ అంతా కూల్ కూల్!

ఎయిర్ కండీషనర్స్ విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న లాయిడ్ (
Llyod), తన గ్రాండే ఎయిర్ కండీషనర్స్ (Grandè air conditioners) సిరీస్ నుంచి మూడు సరికొత్త మోడల్స్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇన్వర్టర్ట్ 5 స్టార్, ఇన్వర్ట్ 3 స్టార్, ఫిక్సుడ్ స్పీడ్ 3 మోడల్స్‌లో ఈ ఎయిర్ కండీషనర్స్ అందుబాటులో ఉంటాయి. వీటిలో ప్రారంభ మోడల్ ధర రూ.45,990. హై-ఎండ్ మోడల్ ధర రూ.79,990.

ఇండోర్ పొల్యుషన్‌ను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు వీలుగా PM 2.5 ఫిల్టర్‌ను ఈ కొత్త మోడల్ ఎయిర్ కండీషనర్స్‌లో ఎక్విప్ చేసినట్లు లాయిడ్ తెలిపింది. భారత ప్రభుత్వం నిర్థేశించిన ఐఎస్ఈఈ (ఇండియన్ సీజన్ ఎనర్జన్సీ ఎఫీషియన్స్ రేషియో) రేటింగ్స్‌కు అనుగుణంగా ఈ మూడు మోడల్స్‌ను తీర్చిదిద్దినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఏసీల్లోని ఇన్వర్టర్ కంప్రెసర్స్ పై 10 సంవత్సరాల వారంటీ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. 

Llyod నుంచి కొత్త ఏసీలు, 45 సెకన్లలో రూమ్ అంతా కూల్ కూల్!

ఈ ఏసీలు 18 డిగ్రీల సెల్సియస్ వద్ద, కేవలం 45 సెకన్ల వ్యవధిలో రూమ్‌ను చల్లబర్చగలవని లాయిడ్ చెబుతోంది. వై-ఫై కనెక్టువిటీతో వస్తోన్న ఈ స్మార్ట్ ఏసీలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేసుకునే వీలుంటుంది. ఇందుకుగాను సంబంధిత యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. 

ఈ ఏసీల్లోని ఫోర్-వే స్వింగ్, రూమ్‌కు నలువైపులా ఒకే విధమైన కూలింగ్ అందేలా చూడ గలుగుతుందట.  100 శాతం నాణ్యతో కూడిన కాపర్ కాయిల్స్‌ను ఈ ఏసీల్లో ఎక్విప్ చేసినట్లు లాయిడ్ చెబుతోంది. ఈ ఏసీల నిర్మాణంలో భాగంగా అవలంభించిన సరికొత్త ఫిష్-ఫిన్ డిజైన్ గాలి ప్రవాహ దూరాన్ని 10 శాతం పెంచగలిగిందట. 

సేఫ్టీ స్టాండర్డ్స్ దృష్ట్యా ఈ ఏసీల్లో లోడ్ చేసిన low-freon ప్రొటెక్షన్ సిస్టమ్, ఏదైనా రిఫ్రిజెరెంట్ లీక్ తలెత్తిన సమయంలో ఎర్రర్ కోడ్‌ను రిపోర్ట్ చేయటంతో పాటు ముందస్తు చర్యగా ఎయిర్ కండీషనర్‌ను షట్‌డౌన్ చేసేస్తుందట. పటిష్టమైన మెటీరియల్‌తో బిల్డ్ చేయబడిన ఈ ఏసీలు డస్ట్ ప్రూఫ్, డ్యాంప్ ప్రూఫ్, ఫంగర్ ప్రూఫ్ ఇంకా ఇన్సెక్ట్ ప్రూఫ్ అని లాయిడ్ చెబుతోంది. 

మెటల్ కంట్రోల్ బాక్స్, ఇకో-ఫ్రెండ్లీ రిఫ్రిజెరెంట్, సెల్ఫ్ క్లీన్ ఫంక్షన్, ఈజీ నైట్ మోడ్, హిడెన్ ఎల్ఈడి డిస్‌ప్లే, డీహ్యూమిడిఫికేషన్, గ్రిల్ టెంపరేచర్ అండ్ టెస్ట్ కండీషన్స్, మల్టీఫోల్డ్ ఇవాపొరేటర్ వంటి స్పెషల్ ఫీచర్స్ గ్రాండే ఎయిర్ కండీషనర్స్‌లో పొందుపరిచినట్లు లాయిడ్ తెలిపింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.