మార్కెట్లోకి నోకియా ప్రో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్, ఖరీదు రూ.5,499

Nokia Pro Wireless earphones
మార్కెట్లోకి నోకియా ప్రో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్, ఖరీదు రూ.5,499

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2019లో భాగంగా  నోకియా 9 ప్యూర్ వ్యూ, నోకియా 4.2, నోకియా 3.2,  నోకియా 1 ప్లస్ వంటి స్మార్ట్‌ఫోన్‌లను ప్రపంచానికి పరిచయం చేసిన నోకియా అదే వేదిక పై  నోకియా ప్రో  వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ (Nokia Pro Wireless earphones)ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 3.5 ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్‌తో వస్తోన్న ఈ ఇయర్‌ఫోన్‌లను నోకియా తన వెబ్ స్టోర్‌లో అమ్మకానికి ఉంచింది. ఖరీదు రూ.5,499.  

BH-107 అనే మోడల్ నెంబర్‌తో విడుదలైన ఈ నెక్ బ్యాండ్ – స్టైల్ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్‌లు బ్రెయిడెడ్ కేబుల్‌కు కనెక్ట్ అయి ఉంటాయి.  వన్ ప్లస్ బుల్లట్ ఇయర్ ఫోన్స్ తరహాలోనే  ప్రో వైర్‌లెస్ ఇయర్ ఫోన్‌లు కూడా స్మార్ట్ మాగ్నెటిక్ ఇయర్ బడ్‌లను కలిగి ఉంటాయి.

BH-107 అనే మోడల్ నెంబర్‌తో విడుదలైన ఈ నెక్ బ్యాండ్ – స్టైల్ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్‌లు బ్రెయిడెడ్ కేబుల్‌కు కనెక్ట్ అయి ఉంటాయి.  వన్ ప్లస్ బుల్లట్ ఇయర్ ఫోన్స్ తరహాలోనే  ప్రో వైర్‌లెస్ ఇయర్ ఫోన్‌లు కూడా స్మార్ట్ మాగ్నెటిక్ ఇయర్ బడ్‌లను కలిగి ఉంటాయి.  క్వాల్కమ్ aptX టెక్నాలజీతో ఎక్విప్ కాబడిన ఈ ఇయర్ ఫోన్స్ హైక్వాలిటీ సౌండ్‌ను ఆఫర్ చేస్తాయని నోకియా చెబుతోంది. చెమట, చమ్మ వంటి వాతవరణాలను ఈ ఇయర్ ఫోన్‌లు సమర్థవంతంగా తట్టుకోగలుగుతాయట.

కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి ఈ ఇయర్ ఫోన్స్ బ్లుటూత్ 4.2 కనెక్టువిటీ పై రన్ అవుతాయి. ఈ వైర్‌లెస్ కనెక్టువిటీని ఉపయోగించుకుని ఒకేసారి రెండు డివైస్‌లకు ఇయర్ ఫోన్‌లను కనెక్ట్ చేసుకునే వీలుంటుంది.  డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, అడ్వాన్సుడ్ ఆడియో డిస్ట్రిబ్యూషన్, ఆడియో/వీడియో రిమోట్ కంట్రోల్ ప్రొఫైల్‌తో పాటు వివిధ హ్యాండ్స్-ఫ్రీ మోడ్స్‌ను ఈ ఇయర్‌ఫోన్‌లలో నిక్షిప్తం చేసినట్లు కంపెనీ పేర్కొంది.  ఈ ఇయర్ ఫోన్‌లను రెండు నుంచి మూడు గంటల పాటు ఛార్జ్ చేయటం ద్వారా 10 గంటల బ్యాకప్‌ను ఆస్వాదించే వీలుంటుందని కంపెనీ చెబుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.