మీ ఆధార్‌తో లింకైన మొబైల్ నెంబర్‌ను వెరిఫై చేసుకోవటం ఎలా?

మీ ఆధార్‌తో లింకైన మొబైల్ నెంబర్‌ను వెరిఫై చేసుకోవటం ఎలా?

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి UIDAI వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. హోమ్ పేజీలో Verify Email/Mobile Number పేరుతో ఓ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మరొక పేజీ  ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మీ ఆధార్ నెంబర్‌తో పాటు నమోదు సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ వంటి వివరాలను  ఎంటర్ చేయవల్సి ఉంటుంది. ఈ ప్రొసీజర్  పూర్తి అయిన తరువాత సెక్యూరిటీ కోడ్‌ను కూడా ఎంటర్ చేసి క్రింద కనిపించే Get One Time Password పై క్లిక్ చేయండి.

మీరు సబ్మిట్ చేసిన వివరాలు సరైనవే అయినట్లయితే మీ మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడీకి ఓటీపీ కోడ్ అందుతుంది. ఆ ఓటీపీని అదే పేజీలో కుడిచేతి వైపు కనిపించే Enter OTP ఫీల్డ్‌లో ఎంటర్ చేసినట్లయితే “Congratulations! The Email ID matches with our records!”,”Congratulations! The Mobile Number matches with our records!” పేరుతో సిస్టం పై మెసేజ్ వస్తుంది. ఇలా వచ్చినట్లయితే మీ ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ మీ పేరు మీదే ఉన్నట్లు నిర్థారించుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.