Jio GigaFiber ప్రస్తుత ఆఫర్స్ ఇంకా ప్లాన్‌లకు సంబంధించి పూర్తి వివరాలు

Jio GigaFiber
Jio GigaFiber ప్రస్తుత ఆఫర్స్ ఇంకా ప్లాన్‌లకు సంబంధించి పూర్తి వివరాలు

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో (Reliance Jio), కొద్ది నెలల క్రితం తన జియోగిగా ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసును ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసును తీసుకున్న వారికి ప్రివ్యూ ఆఫర్‌ను కూడా జియో ప్రొవైడ్ చేస్తోంది.

జియో గిగాఫైబర్ ప్రివ్యూ ఆఫర్ క్రింద యూజర్లు 100 ఎంబీపీఎస్ వేగంతో కూడిన అల్ట్రా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను నెలకు 100జీబి కోటాతో 90 రోజుల పాటు ఆస్వాదించే వీలుంటుంది. ఇదే సమయంలో  జియో ప్రీమియమ్ అప్లికేషన్‌లకు సంబంధించి కాంప్లిమెంటరి యాక్సిస్ వర్తిస్తుంది.

ప్రివ్యూ ఆఫర్ క్రింద లభించే 100జీబి అల్ట్రా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను నెల రోజుల కంటే ముందే కన్స్యూమ్ చేసేసినట్లయితే కాంప్లిమెంటరి డేటా టాపప్ క్రింద అదనంగా 40జీబి డేటాను పొందే వీలుంటుంది. ఈ డేటాను మైజియో యాప్ లేదాజియో.కామ్ ద్వారా పొందవచ్చు.

Jio GigaFiber ప్రస్తుత ఆఫర్స్ ఇంకా ప్లాన్‌లకు సంబంధించి పూర్తి వివరాలు

ప్రస్తుతానికైతే, జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్స్ పై ఎటువంటి ఇన్‌స్టాలేషన్ ఛార్జీలను జియో విధించటం లేదు. అయితే కనెక్షన్ తీసుకునేమందు ONT డివైస్ నిమిత్తం రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ క్రింద రూ.4500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా జియోమనీ ఇంకా పేటీఎమ్ యాప్ ద్వారా చెల్లించే వీలుంటుంది. డిపాజిట్ చేసిన మొత్తాన్నిసర్వీసెస్‌ను డిస్కంటిన్యూ చేసే సమయంలో తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్‌స్టాల్ చసిన డివైసెస్ అన్ని వర్కింగ్ కండీషన్‌లో ఉండాలి. 

ప్రస్తుతానికైతే జియోగిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌కు సంబంధించి ప్రీ-పెయిడ్ సర్వీసెస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే పోస్ట్-పెయిడ్ సేవలను లాంచ్ చేసే అవకాశముంది. జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ను తీసుకోవాలనుకుంటోన్న యూజర్లు ముందుగా తమకు సమీపంలోని రిలయన్స్ జియో స్టోర్‌కు వెళ్లి ప్రివ్యూ ఆఫర్ తమ ఏరియాలో వర్తిస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. 

Jio GigaFiber ప్రస్తుత ఆఫర్స్ ఇంకా ప్లాన్‌లకు సంబంధించి పూర్తి వివరాలు

జియో తెలిపిన వివరాల ప్రకారం జియో గిగాఫైబర్ సేవలను దేశవ్యాప్తంగా 900 నగరాల్లో టెస్ట్ చేయటం జరుగుతోంది. అయితే, మల్టిపుల్ ఆన్ లైన్రిపోర్ట్స్ ప్రకారం జియో గిగాఫైబర్ సేవలు మొదటి ఫేజులో భాగంగా 29 నగరాల్లో  అందుబాటులోఉంటాయి.

ఆ ప్రాంతాల వివరాలు.. బెంగుళూరు, చెన్నై, పూణే, లక్నో, కాన్‌పూర్, రాయ్‌పూర్,నాగ్‌పూర్, ఇండోర్. థాణే, బోపాల్, గజియాబాద్, లుదియానా, కోయింబత్తూర్, ఆగ్రా, మదురై, నాసిక్, ఫరిదాబాద్, మీరుట్, రాజ్ కోట్, శ్రీనగర్, అమృత్ సర్, పాట్నా,అలహాబాద్, రాంచి, జోద్ పూర్, కోట, గౌహతి, చండీగఢ్, సోలాపూర్.

Jio GigaFiber ప్రస్తుత ఆఫర్స్ ఇంకా ప్లాన్‌లకు సంబంధించి పూర్తి వివరాలు

జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌ను ఆప్ట్ చేసుకోవటం ద్వారా హై-స్పీడ్ వై-ఫై కవరేజ్‌తో పాటు కంపెనీకి చెందిన గిగాటీవీ అలానే స్మార్ట్‌హోమ్ సొల్యూషన్స్ మీకు లభిస్తాయి. జియో గిగాఫైబర్ నెట్‌వర్క్‌ను మీ ఇంట్లో సెటప్ చేసే క్రమంలో కంపెనీ ప్రతినిధులు మీ హోమ్ లేదా ఆఫీసులో ప్రత్యేకమైన జియో గిగా‌రౌటర్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ నెట్‌వర్క్ ద్వారా 4కేక్వాలిటీ వీడియోలతో పాటు వీఆర్ గేమ్‌లను కూడా స్ట్రీమ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

పెద్ద స్ర్కీన్ టీవీలను ఉపయోగించుకునే వారు గిగాటీవీ సెట్‌-టాప్ బాక్సులను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా వారికి వాయిస్ యాక్టివేటెడ్ రిమోల్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. దీంతో వాయిస్ ఆధారంగా టీవీ ఛానల్స్‌ను ఆపరేట్ చేసుకునే వీలుంటుంది. ఈ సెట్-టాప్ బాక్సు ద్వారా 600లకు పైగా టీవీ చానల్స్‌తో పాటు వేలాది సినిమాలు, లక్షలాది పాటలను యూజర్ ఆస్వాదించే వీలుంటుంది.

Jio GigaFiber ప్రస్తుత ఆఫర్స్ ఇంకా ప్లాన్‌లకు సంబంధించి పూర్తి వివరాలు

టీవీ స్ర్కీన్ పై జియో టీవీ, జియో సినిమా, జియో టీవీ కాలింగ్, జియో స్మార్ట్ లివింగ్ , జియో నెట్ వెలాసిటీ, జియో క్లౌడ్, మీడియా షేర్ ఇంకా జియో స్టోర్ వంటి యాప్స్ అందుబాటులోఉంటాయి. జియో గిగాఫైబర్ నెట్‌వర్క్‌లో భాగంగా మొబైల్ ఫోన్స్ ఇంకా టాబ్లెట్స్‌ను టీవీకి అనుసంధానించుకుని వీడియో కాల్స్ చేసుకునే వీలుంటుంది.

జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌కు స్మార్ట్ హోమ్ సూట్ గుండెకాయిలా నిలుస్తుంది. ఆడియో డాంగిల్, వీడియో డాంగిల్, స్మార్ట్ స్పీకర్, వై-ఫై ఎక్స్‌టెండర్, స్మార్ట్ ప్లగ్, అవుట్ డోర్ సెక్యూరిటీ కెమెరా, టీవీ కెమెరా వంటి యాక్సెసరీస్ ఈ సూట్‌లో భాగంగా లభిస్తాయి. గిగాఫైబర్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయిన ఇళ్లను స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా మానిటర్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకునే వీలుంటుంది. గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను ఒక ఇంటిలో సెటప్ చేయటానికి గంట కంటే ఎక్కువ సమయం పట్టదని కంపెనీ చెబుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.