వాట్సాప్ లైవ్ లొకేషన్ షేరింగ్ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ఎలా..?

వాట్సాప్ లైవ్ లొకేషన్ షేరింగ్ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ఎలా..?

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లను సొంతం చేసుకున్న వాట్సాప్ మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. లైవ్ లొకేషన్ షేరింగ్ పేరుతో లాంచ్ అయిన ఈ సదుపాయంతో యూజర్లు తమ రియల్-టైమ్ లొకేషన్‌ ను కుటంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేసుకునే వీలుంటుంది. ప్రయాణ సమాయంలో అవతలి వారికి మనం ఎక్కడున్నామో తెలియజేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగడుతుంది. లైవ్ లొకేషన్ ను 15 నిమిషాల నుంచి 8 గంటల వరకు షేర్ చేసుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ లైవ్ లొకేషన్ షేరింగ్ ఫీచర్‌ను ఉపయోగించుకునేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసరీజర్…

ముందుగా మీ ఫోన్‌లోని వాట్సాప్ అప్లికేషన్‌ను లెటెస్ట్ వెర్షన్‌కు అప్‌గేట్ చేసుకోండి. వాట్సాప్ ద్వారా లైవ్ లొకేషన్‌ను షేర్ చేసుకోవటం చాలా సిింపుల్. మెసేజ్ టైపింగ్ కాలమ్‌లో కనిపించే అటాచ్‌మెంట్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే అనేక ఆప్షన్స్ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. వాటిలో కొత్తగా యాడ్ అయిన లొకేషన్ ఆప్షన్ కూడా మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే  మీతో చాటింగ్ లో ఉన్న వ్యక్తి . మీ రియల్ టైమ్ లొకేషన్ ను చూడగలుగుతారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.