లెనోవో నుంచి 5 సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లు, ప్రారంభ మోడల్ ధర రూ.4,990

Lenovo New Tablets
లెనోవో నుంచి 5 సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లు, ప్రారంభ మోడల్ ధర రూ.4,990

చైనా కంప్యూటింగ్ దిగ్గజం లెనోవో, తన టాబ్లెట్ పీసీ లైనప్ నుంచి 5 సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లను మార్కెట్లో అనౌన్స్ఇ చేసింది. వివిధ స్ర్కీన్ సైజుల్లో లాంచ్ అయిన ఈ టాబ్లెట్స్ ఇ-సిరీస్, ఎమ్-సిరీస్ అలానే పీ-సిరీసుల్లో అందుబాటులో ఉంటాయి. వీటిలో చీపెస్ట్ మోడల్ ఆండ్రాయిడ్ గో ఎడిషన్ ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. యూఎస్ కరెన్సీలో ఈ డివైస్ ధర 69.99 డాలర్లు. ఇండియన్ కరెన్సీలో రూ.4,900 వరకు ఉంటుంది. వీటి స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..

లెనోవో ట్యాబ్ ఇ7 (Lenovo Tab E7) స్పెసిఫికేషన్స్..  7 ఇంచ్ 1200 x 600 టీఎన్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,  ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టం, మీడియాటెక్ MT8167 చిప్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమేరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, యూఎస్ కరెన్సీలో ఈ డివైస్ ధర 69.99 డాలర్లు. ఇండియన్ కరెన్సీలో రూ.4,900 వరకు ఉంటుంది.

లెనోవో ట్యాబ్ ఇ7 (Lenovo Tab E8) స్పెసిఫికేషన్స్.. 8 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1280 x 800 పిక్సల్స్), ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ MT8163B ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫ్రంట్ ఫేసింగ్ డాల్బీ అట్మోస్ స్పీకర్, 4,850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లెనోవో ట్యాబ్ ఇ10 (Lenovo Tab E10) స్పెసిఫికేషన్స్.. 10 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1280 x 800 పిక్సల్స్), ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 చిప్‌సెట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫ్రంట్ ఫేసింగ్ డాల్బీ అట్మోస్ స్పీకర్స్, 4,850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. యూఎస్ కరెన్సీలో ఈ డివైస్ ధర 129.99 డాలర్లు. ఇండియన్ కరెన్సీలో రూ.9,100 వరకు ఉంటుంది.

లెనోవో ట్యాబ్ ఎమ్10 (Lenovo Tab M10) స్పెసిఫికేషన్స్.. 10.1 ఇంచ్ ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (డిస్‌ప్లే రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1920 x 1200 పిక్సల్స్), ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,  ఫ్రంట్ ఫేసింగ్ డాల్బీ అట్మోస్ స్పీకర్స్, 4,850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లెనోవో ట్యాబ్ పీ10 (Lenovo Tab P10) స్పెసిఫికేషన్స్.. 10.1 ఇంచ్ ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (డిస్‌ప్లే రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1920 x 1200 పిక్సల్స్), ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా కోర్ 450 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,  ఫ్రంట్ ఫేసింగ్ డాల్బీ అట్మోస్ స్పీకర్స్, 7,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.